+ -

عَنْ مَحْمُودِ بْنِ لَبِيدٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمُ الشِّرْكُ الْأَصْغَرُ» قَالُوا: وَمَا الشِّرْكُ الْأَصْغَرُ يَا رَسُولَ اللهِ؟ قَالَ: «الرِّيَاءُ، يَقُولُ اللهُ عز وجل لَهُمْ يَوْمَ الْقِيَامَةِ إِذَا جُزِيَ النَّاسُ بِأَعْمَالِهِمْ: اذْهَبُوا إِلَى الَّذِينَ كُنْتُمْ تُرَاؤُونَ فِي الدُّنْيَا، فَانْظُرُوا هَلْ تَجِدُونَ عِنْدَهُمْ جَزَاءً؟».

[حسن] - [رواه أحمد] - [مسند أحمد: 23630]
المزيــد ...

మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా మీ విషములో నేను భయపడే విషయం ఏమిటంటే – మీరు చిన్న షిర్క్ కు పాల్బడతారేమోనని.” అక్కడ ఉన్న వారు ఇలా ప్రశ్నించారు “చిన్న షిర్క్ అంటే ఏమిటి ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం?” దానికి ఆయన “ప్రదర్శనా తత్వము (ఏ మంచి పనినైనా లోకులు మెచ్చుకోవాలనే సంకల్పముతో చేయడం) మరియు కాపట్యము” అన్నారు. తీర్పు దినమునాడు ప్రజలకు వారి వారి ప్రతిఫలం ఇవ్వబడుతున్నపుడు, సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ వారితో ఇలా అంటాడు: “ప్రపంచ జీవితంలో (మీరు అల్లాహ్ ను వదిలి) ఎవరినైతే ఆరాధిస్తూ వచ్చినారో వారి వద్దకు వెళ్ళండి, వెళ్ళి వారి వద్ద చూడండి (మీ కొరకు) ఏమైనా ప్రతిఫలం ఉన్నదేమో.”

[ప్రామాణికమైనది] - [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [مسند أحمد - 23630]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: తన ఉమ్మత్ (అనుయాయుల జాతి) పట్ల తాను ఎక్కువగా భయపడే విషయం చిన్న షిర్క్, అంటే ప్రదర్శనా తత్వము (ఏ మంచి పనినైనా లోకులు మెచ్చుకోవాలనే సంకల్పముతో చేయడం) మరియు కాపట్యము గురించి అని. తరువాత ఆయన అటువంటి కపటుల యొక్క శిక్ష ఏమిటో చెప్పారు. తీర్పు దినము నాడు వారికి చెప్పబడుతుంది – ప్రాపంచిక జీవితంలో (ఏ మంచి పనినైనా) మీరు ఎవరి కొరకైతే ఆచరించేవారో వారి వద్దకు వెళ్ళండి. వెళ్ళి చూడండి, మీరు ఆచరించిన దానికి వారేమైనా ప్రతిఫలం ఇవ్వగలరేమో అని.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీథు ద్వారా – ఏ ఆరాధనైనా లేక ఏ సత్కార్యమైనా అది కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించుట, అందులో ప్రదర్శనా తత్వము మరియు కపటత్వము లేకుండా వాటి పట్ల జాగ్రత్తగా ఉండుట విధి అని తెలుస్తున్నది.
  2. అలాగే ఇందులో సహాబాల పట్ల మరియు ఉమ్మత్ పట్ల వారికి సరియైన మార్గదర్శకత్వం చేయుట పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తపన, ఆసక్తి తెలుస్తున్నాయి.
  3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు గొప్ప గొప్ప ఉలమాలకు గురువులు. వారి పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధమైన భయాన్ని వెల్లడించారు అంటే, మరి వారి తరువాతి తరాలను గురించి మరింతగా భయపడవలసిన అవసరం ఉన్నది.
ఇంకా