عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا مِنْ يَوْمٍ يُصْبِحُ العِبَادُ فِيهِ إِلَّا مَلَكَانِ يَنْزِلاَنِ، فَيَقُولُ أَحَدُهُمَا: اللَّهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا، وَيَقُولُ الآخَرُ: اللَّهُمَّ أَعْطِ مُمْسِكًا تَلَفًا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1442]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం వహించకుండా) ఎవరైతే ఖర్చు పెడతాడో, అతడు ఖర్చు పెట్టిన దానికి బదులుగా అతనికి (ఇంకా) ప్రసాదించు” అని, మరొకరు “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టుకుని ఉంచుకుంటాడో అతనికి వినాశం ప్రసాదించు” అని ప్రార్థించకుండా ఒక్క దినము కూడా గడవదు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1442]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "సూర్యుడు ఉదయించే ప్రతి దినము, ఇద్దరు దేవదూతలు దివి నుండి అవతరించి అల్లాహ్’ను ఇలా ప్రార్థిస్తారు: వారిలో ఒకరు ఇలా అంటాడు:
“ఓ అల్లాహ్! ఎవరైతే విధేయతా చర్యలపై ఖర్చు చెస్తాడో, అంటే సత్కార్యాలు చేస్తూ ఉంటాడో, తన బంధువుల కొరకు, అతిథుల కొరకు, స్వచ్ఛంద కార్యాల కొరకు ఖర్చు పెట్టే వానికి, అతడు ఖర్చు పెట్టిన దాని కంటే మెరుగైన ప్రతిఫలాన్ని ప్రసాదించు మరియు వానిపై నీ అనుగ్రహాన్ని కురిపించు.”
మరొక దైవదూత ఇలా అంటాడు: “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టి (పిసినారితనంతో ఖర్చు చేయకుండా) ఉంచుకుంటాడో, వానికి వినాశనాన్ని ప్రసాదించు.”