عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«قَالَ اللهُ: أَنْفِقْ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5352]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదము కుమారుడా! (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి, నీపై ఖర్చు చేయబడుతుంది (అంటే అల్లాహ్ నీపై ఖర్చు చేస్తాడు, ప్రసాదిస్తాడు అని అర్థము).
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5352]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “ఓ ఆదము కుమారుడా! నీ ఖర్చుల నుండి, నీవు విధిగా చేయవలసిన మరియు వాంఛనీయమైన వాటి కొరకు (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి. నీవు ఖర్చు చేసిన దానికి ప్రతిగా మరింత ప్రసాదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను మరియు (తీర్పు దినమున) నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను”.