عن سعد بن عبادة رضي الله عنه أنه قال:
يَا رَسُولَ اللَّهِ، إِنَّ أُمَّ سَعْدٍ مَاتَتْ، فَأَيُّ الصَّدَقَةِ أَفْضَلُ؟، قَالَ: «الْمَاءُ»، قَالَ: فَحَفَرَ بِئْرًا، وَقَالَ: هَذِهِ لِأُمِّ سَعْدٍ.
[حسن بمجموع طرقه] - [رواه أبو داود والنسائي وابن ماجه] - [سنن أبي داود: 1681]
المزيــد ...
సాద్ ఇబ్న్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం – ఆయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు:
“ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”. ఆయన ఒక బావిని త్రవ్వించి “ఇది ఉమ్మె సాద్ కొరకు” అన్నారు.
- - [سنن أبي داود - 1681]
సాద్ ఇబ్న్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) గారి తల్లి చనిపొయింది. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆమె పేరున ఏ దానము చేయుట ఉత్తమంగా ఉంటుంది అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం త్రాగునీరు ఏర్పాటు చేయుట ఉత్తమమైనది అని అన్నారు. అపుడు ఆయన ఒక బావిని త్రవ్వించి దానిని తన తల్లి పేరున అర్పణ చేసారు.