హదీసుల జాబితా

“దానము చేయుట సంపదను తగ్గించదు. ఇతరులను క్షమించే గుణం కారణంగా అల్లాహ్ దాసుని గౌరవాన్ని పెంపొందింప జేస్తాడు మరియు ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు అణకువ, వినయం అలవర్చుకుంటాడో, అల్లాహ్ అతడి స్థానాన్ని ఉన్నతం చేస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదము కుమారుడా! (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి, నీపై ఖర్చు చేయబడుతుంది (అంటే అల్లాహ్ నీపై ఖర్చు చేస్తాడు, ప్రసాదిస్తాడు అని అర్థము)
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం వహించకుండా) ఎవరైతే ఖర్చు పెడతాడో, అతడు ఖర్చు పెట్టిన దానికి బదులుగా అతనికి (ఇంకా) ప్రసాదించు” అని, మరొకరు “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టుకుని ఉంచుకుంటాడో అతనికి వినాశం ప్రసాదించు” అని ప్రార్థించకుండా ఒక్క దినము కూడా గడవదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఆచరణలు ఆరు రకాలు, మరియు మనుషులు నాలుగు రకాలు. (ఆచరణలలో) రెండు విధిగా జరిగేవి, సరికి సరి పరిమాణములో ప్రతిఫలం లభించేవి (రెండు), ఒక మంచి పనికి పది పుణ్యాలు రాయబడేది, ఒక మంచి పనికి ఏడు వందల రెట్లు పుణ్యాలు రాయబడేది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”. ఆయన ఒక బావిని త్రవ్వించి “ఇది ఉమ్మె సాద్ కొరకు” అన్నారు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
అల్లాహ్ మీకు కూడా అలా దానం చేసే అవకాశం ఇవ్వలేదు అని భావిస్తున్నారా? ప్రతిసారి 'సుబహానల్లాహ్' (అల్లాహ్ పరమ పవిత్రుడు) అని ధ్యానం చేయడమూ దానమే, ప్రతిసారి 'అల్లాహు అక్బర్' (అల్లాహ్ గొప్పవాడు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'అల్‌హమ్దులిల్లాహ్' (అల్లాహ్‌కే సకల స్తుతులు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అని పలకడమూ దానమే. మంచి పనిని ప్రోత్సహించడమూ దానమే, చెడు పనిని నిషేధించడము కూడా దానమే. ఇంతేకాదు, మీలో ఎవరు తమ శారీరక కోరికను హలాల్ మార్గంలో తీరుస్తారో, వారికి దాని పుణ్యమూ లభిస్తుంది." అప్పుడు సహాబాలు ఆశ్చర్యపడి, "ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరు తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?
عربي ఇంగ్లీషు ఉర్దూ
నువ్వు ఒక దీనార్ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేశావు మరొకటి బానిస విముక్తి కోసం ఇంకొకటి బీధవాడికి దానం చేశావు మరో దీనార్ నీ కుటుంబీకులపై ఖర్చు చేశావు అందులో పుణ్యప్రధంగా విలువైనది ‘నీ కుటుంబీకుల పై ఖర్చు చేసినదే’
عربي ఇంగ్లీషు ఉర్దూ