عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو رَضِيَ اللَّهُ عَنْهُمَا:
أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الإِسْلاَمِ خَيْرٌ؟ قَالَ: «تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 12]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 12]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది – ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలను ప్రస్తావించారు:
మొదటిది: పేదలకు తరచుగా అన్నం పెట్టడం, ఇందులో స్వచ్ఛంద సేవ, బహుమతులు, ఆతిథ్యం ఇవ్వడం మరియు విందు భోజనాలు ఏర్పాటు చేయడం ఉన్నాయి. ఇతరులకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కరువు, ధరల పెరుగుదల కాలంలో మరింత స్పష్టమవుతుంది.
రెండవది: ప్రతి ముస్లిం కి ‘సలాం’ చేయడం, వారు నీకు పరిచయం ఉన్నవారైనా, పరిచయం లేని వారైనా సరే.