ఉప కూర్పులు

హదీసుల జాబితా

“ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”
عربي ఇంగ్లీషు ఉర్దూ
(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో
عربي ఇంగ్లీషు ఉర్దూ
“వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”
عربي ఇంగ్లీషు ఉర్దూ