عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا انْتَهَى أَحَدُكُمْ إِلَى الْمَجْلِسِ فَلْيُسَلِّمْ، فَإِذَا أَرَادَ أَنْ يَقُومَ فَلْيُسَلِّمْ، فَلَيْسَتِ الْأُولَى بِأَحَقَّ مِنَ الْآخِرَةِ».
[حسن] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وأحمد] - [سنن أبي داود: 5208]
المزيــد ...
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న ఒక సమూహం వద్దకు వచ్చినపుడు అతడు ‘సలాం’ (శాంతి శుభాకాంక్షలు) చెప్పాలి. అలాగే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవడానికి లేచి నిలుచున్నపుడు (కూడా) అతడు ‘సలాం’ చెప్పాలి. మొదటిది చివరిదానికంటే ఎక్కువ అర్హమైనది కాదు.
[ప్రామాణికమైనది] - [దాన్ని నసాయీ ఉల్లేఖించారు] - [سنن أبي داود - 5208]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పేర్కొన్నారు: ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న దగ్గరికి వెళితే అతడు ‘సలాం’ చెప్పాలి, అలాగే అతడు సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళడానికి లేచినపుడు కూడా అక్కడి వారికి ‘సలాం’ చేయాలి; వెళ్ళేటప్పుడు చేసే రెండవ ‘సలాం’ కంటే వచ్చినప్పుడు చేసిన మొదటి ‘సలాం’ మరింత అర్హమైనది కాదు.