عن عائشة رضي الله عنها عن النبي صلى الله عليه وسلم قال:
«إِنَّ أَبْغَضَ الرِّجَالِ إِلَى اللهِ الْأَلَدُّ الْخَصِمُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2457]
المزيــد ...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2457]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ప్రజలలో ఎవరైతే ఏదైనా విషయంపై విపరీత స్థాయిలో జగడానికి దిగుతాడో లేక ఎక్కువగా అలాంటి జగడాలు పెట్టుకుంటాడో అటువంటి వానిని పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు, స్వయం సమృధ్ధుడూ అయిన అల్లాహ్ అసహ్యించుకుంటాడు. అటువంటి వాడు సత్యానికి విధేయత చూపడు. తన వాదనలతో సత్యాన్ని త్రోసి పుచ్చడానికి ప్రయత్నిస్తాడు. లేదా ఒకవేళ అతడు సత్యము పైనే ఉన్నా, జగడంలో ఎంత విపరీత స్థాయికి వెళతాడూ అంటే సహనము, సభ్యతల హద్దు దాటి ప్రవర్తిస్తాడు, మూర్ఖత్వంతో వాదిస్తాడు.