ఉప కూర్పులు

హదీసుల జాబితా

“పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?*” అలా మూడు సార్లు పలికారు. దానికి మేము “తప్పనిసరిగా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని అన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట మరియు వారితో అమర్యాదగా ప్రవర్తించుట” అలా పలికి, అప్పటివరకు చేరగిలబడి కూర్చుని ఉన్న ఆయన నిటారుగా కూర్చుని “అబద్ధమాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” అని అన్నారు. ఈ మాటలను ఆయన ఆగకుండా పలుమార్లు పలుకుతూనే ఉన్నారు. ఎంతగా అంటే “వారు (ఇకనైనా) మౌనంగా ఉంటే బాగుండును” అని మేము భావించ సాగినాము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి*.” దానికి వారు (ఆయన సహచరులు) ఇలా అడిగారు “అవి ఏమిటి ఓ ప్రవక్తా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; చట్టబధ్ధమైన కారణం ఉంటే తప్ప “ప్రాణము తీయరాదు” అని అల్లాహ్ నిషేధించిన ప్రాణము తీయుట; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
القزع
عربي ఇంగ్లీషు ఉర్దూ
. التكلف
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, ఒకరినొకరు అవమానకరంగా దూషించుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ముఖం కోపంతో ఎర్రబారింది, అతని మెడనరాలు ఉబ్బిపోయాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి మినష్’షైతాన్” (నేను షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను) అని పలికినట్లయితే అతడు ఉన్న స్థితి (కోప స్థితి) తొలిగి పోతుంది”*. అక్కడ ఉన్నవారు అతనితో (కోపంతో ముఖము ఎర్రబారిన వ్యక్తితో) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోమన్నారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“దౌర్జన్యము, అణచివేతలకు పాల్బడుట పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే నిశ్చయంగా దౌర్జన్యము, అణచివేతలు ప్రళయదినమునాడు పొరలు కలిగిన అంధకారమై నిలుస్తుంది; పిసినారితనం పట్ల జాగ్రత్తగా ఉండంది, నిశ్చయంగా పిసినారితనం మీకు పూర్వం గతించిన వారిని నాశనం చేసింది*; అది వారిని రక్తం చిందించేలా ప్రేరేపించింది; నిషేధించబడిన వాటిని (హరాం విషయాలను); అనుమతించుకునేలా చేసింది (హలాల్ చేసుకునేలా చేసింది)”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో?*” అక్కడ ఉన్న వారు ఇలా అన్నారు: “మాలో పేదవాడు అంటే ధనము లేనివాడు మరియు ఆస్తిపాస్తులు లేనివాడు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “నిశ్చయంగా నా ఉమ్మత్ (ముస్లిం సమాజము) యొక్క అసలైన పేదవాడు ఎవరంటే – అతడు పునరుథ్థాన దినమున నమాజులతో, ఉపవాసాలతో, దానధర్మాలు, జకాతు దాతృత్వాలతో వస్తాడు; అయితే వీటన్నింటితో పాటు అతడు ఒకరిని అన్యాయంగా అవమానించి ఉంటాడు; మరొకరిని అకారణంగా దూషించి ఉంటాడు; ఇంకొకరి సంపదను అన్యాయంగా తినేసి ఉంటాడు; ఒకరి రక్తాన్ని అధర్మంగా చిందించి ఉంటాడు; మరొకరిని అకారణంగా కొట్టి ఉంటాడు. అతడు వీటన్నింటితో పాటు కూడా వస్తాడు. అణచివేతకు గురిచేయబడిన ప్రతి ఒక్కరికి ఇతని మంచి పనుల నుండి ఇవ్వబడుతుంది. అంతేగాక ఒకవేళ న్యాయం పూర్తిగాక ముందే ఇతని మంచి పనులు అయిపోతే, అణచివేతకు గురి అయిన వారి పాపాలలో కొన్ని ఇతనిపై వేయబడతాయి మరియు అతడు నరకాగ్నిలో పడవేయబడతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా, అరేబియా ద్వీపకల్పంలో “ముసల్లూన్” (నమాజులను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండేవారు) తనను ఆరాధిస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు, కానీ వారి మధ్య విభేదాల బీజాలను నాటగలనని అతడు ఆశిస్తున్నాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.
عربي ఇంగ్లీషు ఉర్దూ