عَنْ جَابِرٍ رضي الله عنه قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ الشَّيْطَانَ قَدْ أَيِسَ أَنْ يَعْبُدَهُ الْمُصَلُّونَ فِي جَزِيرَةِ الْعَرَبِ، وَلَكِنْ فِي التَّحْرِيشِ بَيْنَهُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2812]
المزيــد ...
జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“నిశ్చయంగా, అరేబియా ద్వీపకల్పంలో “ముసల్లూన్” (నమాజులను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండేవారు) తనను ఆరాధిస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు, కానీ వారి మధ్య విభేదాల బీజాలను నాటగలనని అతడు ఆశిస్తున్నాడు.”
[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2812]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అరేబియా ద్వీపకల్పంలో నమాజులను ఆచరించే విశ్వాసులు తనను ఆరాధించడం మరియు విగ్రహాలకు సాష్టాంగం చేయడం వైపు తిరిగి వస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు. అయినప్పటికీ, వివాదాలు, శత్రుత్వం, యుద్ధాలు, కలహాలు మొదలైన వాటిని ప్రేరేపించడం ద్వారా వారి మధ్య విభేదాలను నాటడానికి అతను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు మరియు కష్టపడుతూనే ఉన్నాడు.