عَنْ هِشَامِ بْنِ حَكِيمِ بْنِ حِزَامٍ رَضيَ اللهُ عنهما أَنَّهُ مَرَّ عَلَى أُنَاسٍ مِنَ الْأَنْبَاطِ بِالشَّامِ، قَدْ أُقِيمُوا فِي الشَّمْسِ، فَقَالَ: مَا شَأْنُهُمْ؟ قَالُوا: حُبِسُوا فِي الْجِزْيَةِ، فَقَالَ هِشَامٌ: أَشْهَدُ لَسَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ اللهَ يُعَذِّبُ الَّذِينَ يُعَذِّبُونَ النَّاسَ فِي الدُّنْيَا».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2613]
المزيــد ...

హిషామ్ ఇబ్న్ హకీమ్ ఇబ్న్ హిజామ్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఆయన సిరియాలో ఉన్నపుడు, ఒకసారి ఎండలో నిలబెట్టబడిన కొంతమంది నబాటేనియన్లను దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆయన అక్కడ ఉన్న వారిని “వారి విషయం ఏమిటి?” అని ప్రశ్నించారు. దానికి వారు: “జిజియా చెల్లించనందుకు వారు నిర్బంధించబడినారు” అని బదులిచ్చినారు. అప్పుడు హిషామ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “నేను సాక్ష్యమిస్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నిశ్చయంగా నేను విన్నాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
“నిశ్చయంగా, ఈ లోకంలో ప్రజలను హింసించేవారిని అల్లాహ్ శిక్షిస్తాడు.”

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2613]

వివరణ

హిషాం బిన్ హాకిం బిన్ హిజాం రదియల్లాహు అన్హుమా సిరియాలో ఉండగా, ఒకసారి మండుతున్న ఎండలో నిలబడి ఉన్న కొంతమందిని దాటుకుంటూ వెళ్ళినారు. వారిని గురించి ఆయన వాకబు చేసినారు. వారు చెల్లించగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, జిజియా పన్ను చెల్లించనందుకు వారు ఆ మండుతున్న ఎండలో నిలబెట్టబడినారు అని ఆయనకు తెలియజేయడం జరిగింది. అది విని హిషామ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “”నేను సాక్ష్యమిస్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నిశ్చయంగా, ఈ లోకంలో ప్రజలను అన్యాయంగా, ఎటువంటి హక్కు లేకుండా హింసించేవారిని అల్లాహ్ శిక్షిస్తాడు.”

من فوائد الحديث

  1. అల్ జిజియహ్: అంటే, ఇస్లామిక్ రాజ్యములో నివసిస్తున్న గ్రంథ ప్రజలలో, ధనికులైన మగవారిపై, విధించబడే పన్ను. ఇది వారు ఆ రాజ్యములో నివసిస్తున్నందుకు మరియు వారి రక్షణ కొరకు తీసుకోబడుతుంది.
  2. అవిశ్వాసులనైనా సరే అధర్మముగా, అన్యాయముగా, ఏ కారణమూ లేకుండా ప్రజలను హింసించుట నిషేధము (హరాం).
  3. ఈ హదీథు దౌర్జన్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యకారులను హెచ్చరిస్తున్నది.
  4. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సహచరులు, మంచిని ఆజ్ఞాపించడానికి మరియు చెడును నిషేధించడానికి కట్టుబడి ఉన్నారు.
  5. ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథు అధర్మంగా, అన్యాయంగా ఎవరినైనా హింసించడాన్ని ఖండిస్తున్నది. అయితే ధర్మబధ్ధంగా ఎవరినైనా కఠినంగా శిక్షించడం, ఖిసాస్ (ప్రాణానికి బదులుగా ప్రాణం); మరియు షరియత్’లో నిర్థారించబడిన శిక్షలు, అలాగే క్రమశిక్షణ గరుపుట కొరకు విధించబడే శిక్షలు, మొదలైనవి ఇందులోనికి రావు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية Канада الجورجية المقدونية الخميرية البنجابية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా