عَنْ أَبِي ذَرٍّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لاَ يَرْمِي رَجُلٌ رَجُلًا بِالفُسُوقِ، وَلاَ يَرْمِيهِ بِالكُفْرِ، إِلَّا ارْتَدَّتْ عَلَيْهِ، إِنْ لَمْ يَكُنْ صَاحِبُهُ كَذَلِكَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6045]
المزيــد ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నాను అని అబూదర్ గఫ్ఫారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు:
“ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక అతనిపై “కుఫ్ర్” (సత్యతిరస్కారపు) నింద మోపితే (అంటే అతడు ‘కాఫిర్’ (సత్యతిరస్కారి) అని నింద మోపితే) – ఒకవేళ నింద మోపబడిన ఆ సహచరుడు వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే – అది ఆ నింద మోపిన వాని వైపునకే తిరిగి వస్తుంది.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6045]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరిస్తున్నారు: ఎవరైనా మరొకరిని “నీవు “ఫాసిఖ్” (పాపివి, దుష్టుడవు) అని లేక “నీవు “కాఫిర్” (సత్యతిరస్కారివి, అవిశ్వాసి) అని అన్నట్లయితే; ఒకవేళ ఆ నిందమోపబడిన వ్యక్తి వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే’, తాను ఆపాదించిన ఆ గుణాలకు స్వయంగా తానే అర్హుడు అవుతాడు; మరియు అతని మాటలు అతని వైపునకే తిరిగి వస్తాయి. ఒకవేళ ఆ విధంగా ఆపాదించబడిన వ్యక్తి నిజంగానే అలాంటి వాడే అయినట్లయితే, ఆపాదించిన వాని వైపునకు ఏమీ తిరిగి రాదు, ఎందుకంటే అతడు సత్యమే పలికినాడు గనుక.