عن عائشة رضي الله عنها قالت:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَذْكُرُ اللهَ عَلَى كُلِّ أَحْيَانِهِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 373]
المزيــد ...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా అల్లాహ్’ను స్మరించేవారు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 373]
ఆయిషా రజియల్లాహు అన్హా – విశ్వాసుల మాతృమూర్తి – ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్మరించుటలో ఎక్కువ చురుకుగా, ఉత్సాహంగా, ఆసక్తి కలిగి ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా, అన్ని స్థితులలో మరియు ఏ ప్రదేశములో నైనా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండేవారు.