عَنْ أَنَسٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا تَوَضَّأَ أَحَدُكُمْ وَلَبِسَ خُفَّيْهِ فَلْيُصَلِّ فِيهِمَا، وَلْيَمْسَحْ عَلَيْهِمَا ثُمَّ لَا يَخْلَعْهُمَا إِنْ شَاءَ إِلَّا مِنْ جَنَابَةٍ».
[صحيح] - [رواه الدارقطني] - [سنن الدارقطني: 781]
المزيــد ...
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
[దృఢమైనది] - [దానిని దారు ఖుత్నీ ఉల్లేఖించారు] - [سنن الدارقطني - 781]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఉదూ చేసిన తరువాత ఒక ముస్లిం తన రెండు పాదాలకు “ఖుఫ్ఫైన్” తొడుగుకున్నట్లయితే; తరువాత ఒకవేళ ఉదూ భంగపడినట్లయితే, తిరిగి ఉదూ ఆచరించునపుడు అతనికి ఇష్టమైతే “ఖుఫ్ఫైన్” ను పాదాల నుంచి తొలగించకుండా వాటిపైన తడిచేతులతో మసహ్ చేసి (తడిచేతులతో తడిమి) వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే నమాజు ఆచరించవచ్చు. ఈ విధంగా అతడు “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోను కానంత వరకు, ఒక నియమిత కాలం వరకు చేయవచ్చు. జనాబత్ స్థితికి లోనైతే మాత్రం ఖుఫ్ఫైన్’ను కాళ్ళ నుండి తొలగించి అతడు గుసుల్ చేయవలసి ఉంటుంది.