عن بريدة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«إِنَّ الْعَهْدَ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ».
[صحيح] - [رواه الترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن النسائي: 463]
المزيــد ...
బురైదహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”
[దృఢమైనది] - - [سنن النسائي - 463]
ఈ హదీసులో – ముస్లిములకు మరియు ముస్లిమేతరులకు అంటే అవిశ్వాసులకు మరియు కపటవిశ్వాసులకు మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు) అని, ఎవరైతే సలాహ్ ను వదిలి వేసినాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినవాడు అవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు.