عن ابن عباس رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«من اقتبَسَ علْمًا مِنَ النُّجُومِ اقْتبَسَ شُعبَة مِن السِّحرِ، زادَ ما زادَ».
[صحيح] - [رواه أبو داود وابن ماجه وأحمد] - [سنن أبي داود: 3905]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను) నేర్చుకున్నట్లే. అతడు ఎంత కాలం ఆ విద్యను గడించితే అంత ఎక్కువగా దానిని పొందినట్లే.”
[దృఢమైనది] - - [سنن أبي داود - 3905]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే నక్షత్రాల గమనాలను, గ్రహాల గమనాలను అధ్యయనం చేయడం ద్వారా, అవి (భూకక్ష్య లోనికి) ప్రవేశించడం లేదా (దూరంగా) వెళ్ళిపోవడం మొదలైన వాటి ద్వారా – భూమిపై జరిగే ఘటనలను, ఉదాహరణకు ఎవరి మృత్యువునకు లేక ఎవరి జన్మకు లేక ఎవరైనా వ్యాధిగ్రస్తులు కావడానికి, లేక అలాంటి విషయాలకు లేక భవిష్యత్తులో జరుగబోయే అలాంటి విషయాలకు ముడిపెట్టి వాటికి ఋజువులుగా చూపుతాడో – అతడు నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్ర) విద్యలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్లే. అతడు ఎంత ఎక్కువగా అందులో నిమగ్నమైపోతే అంత ఎక్కువగా ఆ విద్యను నేర్చుకున్నట్లే.