ఉప కూర్పులు

హదీసుల జాబితా

“ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జోస్యము చెప్పించుకుంటాడో; లేదా ఎవరైతే చేతబడి చేస్తాడో, లేక చేతబడి చేయిస్తాడో; అలాంటి వాడు మాలోని వాడు కాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను) నేర్చుకున్నట్లే. అతడు ఎంత కాలం ఆ విద్యను గడించితే అంత ఎక్కువగా దానిని పొందినట్లే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీ ప్రభువు ఏమని అన్నాడో తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే తెలుసును” అని జవాబిచ్చారు. దానికి ఆయన “అల్లాహ్ ఇలా అన్నాడు “నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసిస్తూ (విశ్వాసులుగా) ఈనాటి ఉదయంలోనికి ప్రవేశించినారు, మరియు మరికొందరు అవిశ్వాసులుగా ప్రవేశించినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ