+ -

عَنْ زَيْدِ بْنِ خَالِدٍ الجُهَنِيِّ رضي الله عنه أَنَّهُ قَالَ:
صَلَّى لَنَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَاةَ الصُّبْحِ بِالْحُدَيْبِيَةِ عَلَى إِثْرِ سَمَاءٍ كَانَتْ مِنَ اللَّيْلَةِ، فَلَمَّا انْصَرَفَ أَقْبَلَ عَلَى النَّاسِ، فَقَالَ: «هَلْ تَدْرُونَ مَاذَا قَالَ رَبُّكُمْ؟» قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «أَصْبَحَ مِنْ عِبَادِي مُؤْمِنٌ بِي وَكَافِرٌ، فَأَمَّا مَنْ قَالَ: مُطِرْنَا بِفَضْلِ اللهِ وَرَحْمَتِهِ، فَذَلِكَ مُؤْمِنٌ بِي وَكَافِرٌ بِالْكَوْكَبِ، وَأَمَّا مَنْ قَالَ: بِنَوْءِ كَذَا وَكَذَا، فَذَلِكَ كَافِرٌ بِي وَمُؤْمِنٌ بِالْكَوْكَبِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 846]
المزيــد ...

జైద్ ఇబ్నె ఖాలిద్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఒకసారి హుదైబియాలో (ఉన్నప్పుడు) రాత్రి వర్షం పడిన తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజ్ర్ నమాజు చదివించినారు. నమాజు ముగిసిన తరువాత ఆయన ప్రజల వైపునకు తిరిగి ఇలా అన్నారు “మీ ప్రభువు ఏమని అన్నాడో తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే తెలుసును” అని జవాబిచ్చారు. దానికి ఆయన “అల్లాహ్ ఇలా అన్నాడు “నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసిస్తూ (విశ్వాసులుగా) ఈనాటి ఉదయంలోనికి ప్రవేశించినారు, మరియు మరికొందరు అవిశ్వాసులుగా ప్రవేశించినారు. ఎవరైతే ‘అల్లాహ్ అనుగ్రహం మరియు కరుణ వలన మనపై వర్షం కురిసింది’ అని అన్నారో, వారు నన్ను విశ్వసించినారు మరియు నక్షత్రాలను విశ్వసించలేదు. మరియు ఎవరైతే ‘ఫలాన ఫలాన నక్షత్రాలు ఉదయించడం వలన మనపై వర్షం కురిసింది’ అన్నారో, వారు నన్ను విశ్వసించలేదు, మరియు నక్షత్రాలను విశ్వసించినారు”.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 846]

వివరణ

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరానికి సమీపంలో నున్న హుదైబియా అనే ప్రాంతంలో ఫజ్ర్ నమాజు ఆచరించినారు. అక్కడ క్రితం రాత్రి వర్షం కురిసింది. ఆయన ఫజ్ర్ సలాహ్ ముగించిన తరువాత ప్రజల వైపునకు తిరిగి కూర్చుని వారిని ఇలా ప్రశ్నించారు “సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన మీ ప్రభువు ఏమని అన్నాడో మీకు తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వర్షం కురిసినపుడు ప్రజలు రెండు వర్గాలలో విడిపోయినారు అని అల్లాహ్ స్పష్టపరిచినాడు. ఒక వర్గం అల్లాహ్ నందు విశ్వసించి, విశ్వాసులుగా ఉంటే, మరొక వర్గం అల్లాహ్ ను విశ్వసించక అవిశ్వాసులు అయినారు”. “ఎవరైతే ‘అల్లాహ్ అనుగ్రహం మరియు కరుణ వలన మనపై వర్షం కురిసింది’ అని వర్షం కురియడాన్ని అల్లాహ్’కు ఆపాదించినాడో, అతడు సృష్టికర్త మరియు సృష్టి యొక్క అన్ని విషయాల విధాత అయిన అల్లాహ్ నందు విశ్వసించినాడు. అతడు నక్షత్రాలను నమ్మలేదు, వాటిని విశ్వసించలేదు”. “మరియు ఎవరైతే “ఫలాన, ఫలాన నక్షత్రాల కారణంగా వర్షం కురిసింది” అన్నాడో, అతడు అల్లాహ్ ను విశ్వసించకుండా నక్షత్రాలను, గ్రహాలను విశ్వసించినాడు. వర్షం కురియడాన్ని నక్షత్రాలకు ఆపాదించడం అనేది చిన్న స్థాయి అవిశ్వాసము. అల్లాహ్ కారణాన్ని షరియత్ గానూ లేక పూర్వనిర్దిష్టంగానూ (విధివ్రాతగానూ) చేయలేదు”. “మరియు ఎవరైతే వర్షం కురియడాన్ని, అలాగే భూమిపై జరిగే సంఘటనలకు, విషయాలకు సంబంధించి (సృష్టికర్త ప్రమేయం ఏమీ లేదని) అవి గ్రహాల చలనం కారణంగానో, అవి ఉదయించడం వల్లనో లేక రాలిపోవడం వల్లనో జరుగుతాయని విశ్వసిస్తాడో, వాటిని నక్షత్రాలకు లేక గ్రహాలకు ఆపాదిస్తాడో అతడు వాస్తవానికి ఘోరమైన పాపము చేసినవాడు. అతడు అవిశ్వాసి, అతడు ఘోరమైన అవిశ్వాసమునకు పాల్బడినవాడు”.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ الفولانية ఇటాలియన్ Урумӣ Канада الولوف البلغارية Озарӣ اليونانية الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. వర్షం కురిసిన తరువాత వాంఛనీయమైన విషయం ఏమిటంటే – ‘అల్లాహ్ అనుగ్రహం వలన, కరుణ వలననే మనపై వర్షం కురిసింది’ అనడం.
  2. ఎవరైతే వర్షం కురవడం ఇంకా అటువంటి ఇతర అనుగ్రహాలు కలగడాన్ని, అవి సృష్టించబడడాన్ని మరియు ఉనికిలోనికి రావడాన్ని పూర్తిగా గ్రహాలకు ఆపాదిస్తాడో అతడు ‘కాఫిర్’ (అవిశ్వాసి). అతడు ఘోరమైన అవిశ్వాసానికి పాల్బడినవాడు అవుతాడు. మరియు గ్రహాలను ఒక కారణంగా చూస్తాడో అతడు తక్కువ స్థాయి అవిశ్వాసానికి పాల్బడినవాడు అవుతాడు, ఎందుకంటే అలా భావించడం షరియత్’కు అనుగుణమైనదీ కాదు లేక అది ఙ్ఞానవంతమైన విషయమూ కాదు.
  3. (వర్షం కురియుట మొదలైన ఇతర) అనుగ్రహాలు అనేవి అవిశ్వాసానికి దారి తీస్తాయి - ఒకవేళ వాటిని అల్లాహ్ అనుగ్రహాలుగా విశ్వసించక పోయినట్లయితే;
  4. అలాగే విశ్వాసానికి, కృతజ్ఞతకు, విధేయతకు దారితీస్తాయి - ఒకవేళ వాటిని అల్లాహ్ అనుగ్రహాలుగా విశ్వసించినట్లయితే.
  5. “ఫలానా తుఫాను కారణంగా వర్షం కురిసింది” లాంటి మాటలు అనడం కూడా నిషేధం; అవి నిజానికి ఆ సమయాన్ని సూచించే పదాలే అయినప్పటికీ. ఇది “షిర్క్” యొక్క మార్గాలను (అల్లాహ్ అన్ని విషయాల విధాత కావడంలో వేరే కారణాలను కూడా ఆయనకు సమానంగా నిలబెట్టడాన్ని) మొదట్లోనే నిరోధిస్తుంది, మూసివేస్తుంది.
  6. హృదయం అన్ని వేళలా సర్వోన్నతుడైన అల్లాహ్’తో అనుసంధానం అయి ఉండేలా చూసుకోవడం ప్రతి విశ్వాసి యొక్క విధి. అది అతనిపై అనుగ్రహాలు కురిపిస్తుంది, మరియు ఆపదలను, విపత్తులను దూరం చేస్తుంది.
ఇంకా