ఉప కూర్పులు

హదీసుల జాబితా

:
عربي ఇంగ్లీషు ఉర్దూ
(ఒక ప్రయాణములో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్”. దానికి ఆయన “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి “ఓ ముఆధ్!” అన్నారు. ఆయన తిరిగి “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మూడవసారి కూడా అదే విధంగా జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “@ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు.*” అది విని ముఆధ్ “ఓ రసూలుల్లాహ్! ఈ వార్తను నేను మిగతా వారందరికీ వినిపించనా, వారు సంతోషిస్తారు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వద్దు, అలా చేస్తే వారు ఈ ఒక్క దానిపైనే ఆధారపడతారు (అంటే మిగతా సత్కార్యాలు చేయడం పట్ల ఆసక్తి చూపకుండా)” అన్నారు. ముఆధ్ రజియల్లాహు అన్హు తన మరణశయ్యపై ఉండి ఈ హదీసును ఉల్లేఖించినారు – జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయకుండా దాచుకున్న పాపమునకు తాను లోను కారాదనే భయంతో.
عربي ఇంగ్లీషు ఉర్దూ
రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చారు. ఇంటిలో ఒక బీరువా లాంటిది ఉన్నది, దానిపై నేను సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినాను. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. ఆయన దానిని చూస్తూనే చించి వేసారు. ఆయన ముఖము రంగు మారింది. ఆయన “ఓ ఆయిషా! @పునరుత్థాన దినాన అల్లాహ్ వద్ద అతి కఠినమైన శిక్ష, సృష్టి కర్తగా (ఆయన చేసే పనిని) ఆయనను అనుకరించే వారికి ఉంటుంది*” అన్నారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు “మేము దానిని ముక్కలుగా చించివేసి దానితో ఒకటో, రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మాతో ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! తీర్పు దినమున అవిశ్వాసి తన ముఖము పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “@ అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?*” అన్నారు. ఖతాదహ్ ఇలా అన్నారు “అవును, మా ప్రభువు (అయిన అల్లాహ్) గౌరవం సాక్షిగా (ఆయన అలా చేయగల శక్తిశాలి)”.
عربي ఇంగ్లీషు ఉర్దూ