عَنْ عَائِشَةَ أُمِّ المُؤمنينَ رضي الله عنها قَالَتْ:
دَخَلَ عَلَيَّ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدْ سَتَرْتُ سَهْوَةً لِي بِقِرَامٍ فِيهِ تَمَاثِيلُ، فَلَمَّا رَآهُ هَتَكَهُ وَتَلَوَّنَ وَجْهُهُ وَقَالَ: «يَا عَائِشَةُ، أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللهِ يَوْمَ الْقِيَامَةِ الَّذِينَ يُضَاهُونَ بِخَلْقِ اللهِ» قَالَتْ عَائِشَةُ: «فَقَطَعْنَاهُ فَجَعَلْنَا مِنْهُ وِسَادَةً أَوْ وِسَادَتَيْنِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2107]
المزيــد ...
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి) ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు:
రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చారు. ఇంటిలో ఒక బీరువా లాంటిది ఉన్నది, దానిపై నేను సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినాను. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. ఆయన దానిని చూస్తూనే చించి వేసారు. ఆయన ముఖము రంగు మారింది. ఆయన “ఓ ఆయిషా! పునరుత్థాన దినాన అల్లాహ్ వద్ద అతి కఠినమైన శిక్ష, సృష్టి కర్తగా (ఆయన చేసే పనిని) ఆయనను అనుకరించే వారికి ఉంటుంది” అన్నారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు “మేము దానిని ముక్కలుగా చించివేసి దానితో ఒకటో, రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2107]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉన్న చోటుకి వెళ్ళారు. అక్కడ ఒక సామానులు పెట్టుకునే బీరువాలాంటిది ఉన్నది, దానిపై ఆమె సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినారు. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. అల్లాహ్ కోసం కోపంతో ఆయన ముఖపు రంగు మారిపోయింది, మరియు ఆయన దానిని (ఆ తెరను) తీసివేసారు. ఆయన ఇలా అన్నారు: “ప్రళయ దినాన అత్యంత కఠినమైన శిక్షను అనుభవించే వ్యక్తులు ఎవరంటే తాము చిత్రించిన చిత్రాలతో అల్లాహ్ యొక్క సృష్టిని అనుకరించటానికి ప్రయత్నించేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు: “మేము దానితో ఒకటో లేక రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము."