+ -

عَنْ عَبْدِ اللهِ بنِ مَسْعُودٍ رضي الله عنه قال:
سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللهِ؟ قَالَ: «أَنْ تَجْعَلَ لِلهِ نِدًّا وَهُوَ خَلَقَكَ» قُلْتُ: إِنَّ ذَلِكَ لَعَظِيمٌ، قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «وَأَنْ تَقْتُلَ وَلَدَكَ؛ تَخَافُ أَنْ يَطْعَمَ مَعَكَ» قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4477]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను:(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ), అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4477]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఘోరమైన పాపములను గురించి ప్రశ్నించడం జరిగింది, దానికి ఆయన ఇలా అన్నారు: వాటిలో అన్నింటికన్నా ఘోరమైనది “అష్’షిర్క్ అల్ అక్బర్” (పెద్ద షిర్క్); అంటే అల్లాహ్ యొక్క “ఉలూహియత్’లో” (కేవలం ఆయన మాత్రమే అన్ని ఆరాధనలకు ఏకైక నిజ ఆరాధ్యుడు అనే విషయములో); అల్లాహ్ యొక్క “రుబూబియత్”లో (కేవలం అల్లాహ్ మాత్రమే ఈ విశ్వం మొత్తానికీ ప్రభువు అనే విషయములో); మరియు అల్లాహ్ యొక్క “శుభ నామములలో”, మరియు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన గుణగణాలలో - ఆయనకు సమానమైన వాడిగా, లేక ఆయనను పోలిన వానిగా, ఆయనకు సాటిగా మరొకరిని తీసుకు రావడం – ఇది అన్నింటికన్నా ఘోరమైన పాపము. ఈ పాపాన్ని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడు – దీనికి పాల్బడినవాడు పశ్చాత్తాపము చెందితే తప్ప. ఒకవేళ అతడు ప్రశ్చాత్తపము చెందకుండా, దానిపైనే చనిపోతే అటువంటి వాడు శాశ్వతముగా నరకములో పడి ఉంటాడు. తరువాత – తనతో పాటు తింటాడు అనే భయంతో ఒక వ్యక్తి తన బిడ్డను తానే చంపడం. ఎవరినైనా ధర్మవిరుద్ధంగా చంపడం హరాం (నిషేధము). కానీ దాని తీవ్రత ఇంకా అధికమవుతుంది ఒకవేళ హతుడు, హంతకుడి బంధువు అయినట్లయితే; దాని తీవ్రత మరింత అధికమవుతుంది అల్లాహ్ ప్రాసాదించిన ఉపాధిలో అతడు కూడా భాగస్వామి అవుతాడు అనే ఉద్దేశ్యముతో హత్య చేసినట్లయితే. తరువాత – తన పొరుగువాని భార్యను మాయమాటలు చెప్పి, చివరికి మోసపూరితంగా లోబడిపోయేలా చేసుకుని ఆమెతో వ్యభిచరించడం. (ఇస్లాం లో) వ్యభిచారం హరాం (నిషేధము). ఆ పాపము యొక్క తీవ్రత మరింతగా ఎక్కువ అవుతుంది, అది తన పొరుగువాని భార్యతో అయినట్లయితే – ఎందుకంటే షరియత్ పొరుగువాని పట్ల దయతో, అతనితో మంచినడవడితో, ఒక మంచి పొరుగువానిగా ఉండమని ఆదేశిస్తున్నది.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఏ విధంగానైతే సత్కార్యాలు భిన్నమైన స్థాయిలు కలిగి ఉంటాయో, పాపకార్యాలు కూడా తీవ్రతలో హెచ్చుతగ్గులు కలిగి ఉంటాయి.
  2. ఘోరమైన పాపములు: అల్లాహ్ కు సాటి కల్పించుట, నీతో పాటు (నీ ఉపాధి నుండి) తింటాదు అనే ఉద్దేశ్యముతో నీ సంతానాన్ని నీవే చంపుట; మరియు పొరుగువాని భార్యతో వ్యభిచరించుట.
  3. నిశ్చయంగా, జీవనోపాధి అంతా అల్లాహ్ చేతిలోనే ఉంది. సర్వలోకాలకు జీవనోపాధిని ప్రసాదించేవాడు పరమ పవితుడైన ఆయనే (అల్లాహ్’యే).
  4. (ఇస్లాం లో) పొరుగు వాని హక్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. అతనికి ఏ విధంగానైనా హాని, నష్టం కలిగించడం, ఇతరులకు హాని, నష్టం కలిగించిన దాని కంటే చాలా తీవ్రమైనది.
  5. సృష్టికర్తయైన అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు ఏకైక అర్హుడు; ఆయనకు సాటి, సమానులు ఎవరూ లేరు.
ఇంకా