عن حفصة بنت عمر بن الخطاب رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال: "من أتَى عرَّافًا فسأله عن شيء، فصدَّقه لم تُقْبَلْ له صلاةٌ أربعينَ يومًا".
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

హఫ్స బింతే ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హుమ కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు’జ్యోతిష్కుడి వద్దకి వెళ్ళి అతన్ని ఏదైనా విషయం గురించి అడిగి తెలుసుకొని దాన్ని నమ్మినట్లైతే ఆ వ్యక్తి నలబై రోజుల వరకు నమాజు ఆమోదించబడదు.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

మహనీయ మహోదయ దైవప్రవక్త మాకు ఈ హదీసులో భోదించారు :అగోచర విషయాల జ్ఞానముందని దావా చేసే జ్యోతిష్యుల వద్దకు ఎవరైతే వెళ్ళి అగోచర విషయాలకు చెందిన విషయాలను అడిగి పిదప ఆ విషయాలను అంగీకరిస్తాడో నిశ్చయంగా అల్లాహ్ అతని నమాజుల పుణ్యాన్ని నలబై రోజుల వరకు నిషేదిస్తాడు,అది అతను ఒడిగట్టిన తప్పిదానికి మరియు పెద్ద పాపానికి శాపము,ఇక ఎవరైతే అతను చెప్పిన విషయాలను అంగీకరించి స్వీకరిస్తాడో అతను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారిపై అవతరించిన దైవవాణి ఖుర్ఆ్న్ ను దిక్కరించాడు,అని మరో హదీసులో తెలియజేయబడినది :జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళిన వ్యక్తికి ప్రతిఫలం ఇలా ఉంటే ఇక జ్యోతిష్యం చెప్పేవాడి గతిఎలా ఉంటుంది!’’ ఇలాంటి విషయాలనుండి మేము అల్లాహ్ శరణు వేడుతున్నాము,మరియు అల్లాహ్ తో రక్షణ ఆర్ధిస్తున్నాము.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ సింహళ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. జ్యోతిష్యుల వద్దకి వెళ్ళడం,వారితో అగోచర విషయాలను అడగడం మరియు ఆ విషయాల్లో వారిని సత్యమని అంగీకరించడాన్ని ఆపబడుతుంది,ఎందుకంటే ఇలా చేయడం కుఫ్ర్ అవుతుంది
  2. జ్యోతిష్యం నిషేదం ఎందుకంటే అది మహాపరదాలలో ఒకటి
  3. మనిషి విధేయత యొక్క ఫలాన్ని కోల్పోవడం అతను చేసే తప్పిదాలకు,పాపాలకు ప్రతిఫల పరిణామము.
ఇంకా