عَن أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَنْظُرُ الرَّجُلُ إِلَى عَوْرَةِ الرَّجُلِ، وَلَا الْمَرْأَةُ إِلَى عَوْرَةِ الْمَرْأَةِ، وَلَا يُفْضِي الرَّجُلُ إِلَى الرَّجُلِ فِي ثَوْبٍ وَاحِدٍ، وَلَا تُفْضِي الْمَرْأَةُ إِلَى الْمَرْأَةِ فِي الثَّوْبِ الْوَاحِدِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 338]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఒక పురుషుడు మరో పురుషుని ‘ఔరహ్’ ను చూడరాదు. మరియు ఒక స్త్రీ మరో స్త్రీ ‘ఔరహ్’ ను చూడరాదు. అలాగే ఇద్దరు పురుషులు ఒకే వస్త్రములో (లేదా ఒకే వస్త్రము క్రింద నగ్నంగా) పడుకోరాదు, మరియు ఇద్దరు స్త్రీలు ఒకే వస్త్రములో (లేదా ఒకే వస్త్రము క్రింద నగ్నంగా) పడుకోరాదు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 338]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పురుషుడు మరొక పురుషుని ‘ఔరహ్’ను, మరియు ఒక స్త్రీ మరొక స్త్రీ యొక్క ‘ఔరహ్’ను చూడరాదు అని నిషేధించినారు.
ఔరహ్: ఏది బహిర్గతమైతే మనిషి సిగ్గుపడతాడో అటువంటి ప్రతిదీ ‘ఔరహ్’ అనబడుతుంది. పురుషుని శరీరం లో అతని నాభి నుండి మోకాలి వరకు మధ్య ఉన్న శరీర భాగము అతని ‘ఔరహ్’ అనబడుతుంది. స్త్రీ విషయానికి వస్తే, పరపురుషులకు సంబంధించి ఆమె పూర్తిగా (తల నుండి పాదాల వరకు) ‘ఔరహ్’గా భావించబడుతుంది. కానీ ఇతర స్త్రీలకు సంబంధించి మరియు తన ‘మహ్రం’ పురుష బంధువులకు (షరియత్ అనుమతించిన పురుష బంధువులు) సంబంధించి తాను ఇంటి పనులు చేసుకునేటపుడు సాధారణంగా బహిర్గతమయ్యే శరీర భాగాలు వారి ఎదుట బహిర్గతం కావచ్చును.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఒకే వస్త్రంలో లేదా ఒకే వస్త్రము క్రింద (దుప్పట్లో) ఇద్దరూ నగ్నంగా ఉండడాన్ని నిషేధించారు. మరియు ఒక స్త్రీ మరొక స్త్రీతో ఒకే వస్త్రంలో లేదా ఒకే వస్త్రము క్రింద (దుప్పట్లో) ఇద్దరూ నగ్నంగా ఉండడాన్ని నిషేధించారు. ఎందుకంటే అది ఒకరి ఔరహ్ ను మరొకరు తాకడానికి దారి తీస్తుంది. ఏవిధంగానైతే ఒకరి ‘ఔరహ్’ మరొకరు చూడడం నిషేధమో, అదే విధంగా ఒకరి ‘ఔరహ్’ను మరొకరు తాకడం కూడా నిషేధం. నిజానికిది మరింత కఠినంగా నిషేధించబడింది. అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.