عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ رضي الله عنهما أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«اتَّقُوا الظُّلْمَ، فَإِنَّ الظُّلْمَ ظُلُمَاتٌ يَوْمَ الْقِيَامَةِ، وَاتَّقُوا الشُّحَّ، فَإِنَّ الشُّحَّ أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ، حَمَلَهُمْ عَلَى أَنْ سَفَكُوا دِمَاءَهُمْ وَاسْتَحَلُّوا مَحَارِمَهُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2578]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“దౌర్జన్యము, అణచివేతలకు పాల్బడుట పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే నిశ్చయంగా దౌర్జన్యము, అణచివేతలు ప్రళయదినమునాడు పొరలు కలిగిన అంధకారమై నిలుస్తుంది; పిసినారితనం పట్ల జాగ్రత్తగా ఉండంది, నిశ్చయంగా పిసినారితనం మీకు పూర్వం గతించిన వారిని నాశనం చేసింది; అది వారిని రక్తం చిందించేలా ప్రేరేపించింది; నిషేధించబడిన వాటిని (హరాం విషయాలను); అనుమతించుకునేలా చేసింది (హలాల్ చేసుకునేలా చేసింది)”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2578]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “జుల్మ్”నకు (దౌర్జన్యము, అణచివేతలకు) పాల్బడుటను గురించి హెచ్చరిస్తున్నారు. అది ప్రజల పట్ల దౌర్జన్యము గానీ, తన స్వయం పట్ల దౌర్జన్యము గానీ, లేక అల్లాహ్ యొక్క హక్కుల పట్ల దౌర్జన్యము గానీ – వీటన్నిటి పట్ల ఈ హదీథులో హెచ్చరిస్తున్నారు. “జుల్మ్” అంటే ఎవరి హక్కును వారికి చెల్లించకపోవడం. ఈ హదీథులో ప్రళయ దినమున “జుల్మ్” పొరలు కలిగిన అంధకారమై వస్తుంది అని వర్ణించడం జరిగింది – అంటే ఆ దినమునాడు “జుల్మ్” నకు పాల్బడిన వానిపై విరుచుకుపడే దుర్భరమైన శిక్షలు, భయానకమైన విషయాలు అన్నమాట. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిసినారితనం గురించి కూడా హెచ్చరించినారు. ఇక్కడ పిసినారితనం అంటే విపరీతమైన లోభము మరియు విపరీతమైన దురాశ అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు పిసినారితనం వల్ల ఒకరికి హక్కుగా చెల్లించవలసిన ఆర్థికపరమైన విషయాలలో తక్కువ చేయడం; విపరీతమైన దురాశ కారణంగా ప్రాపంచిక లాభాల పట్ల తీవ్రంగా చింతించడం. ఈ విధమైన “జుల్మ్” మన పూర్వతరాలలో కొన్నిటిని నాశనం చేసింది; అది వారిని ఒకరినొకరు చంపుకునేలా చేసింది, హరాంను హలాల్ గా చేసుకునేలా చేసింది.