عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
«بَيْنَمَا جِبْرِيلُ قَاعِدٌ عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ سَمِعَ نَقِيضًا مِنْ فَوْقِهِ، فَرَفَعَ رَأْسَهُ، فَقَالَ: هَذَا بَابٌ مِنَ السَّمَاءِ فُتِحَ الْيَوْمَ لَمْ يُفْتَحْ قَطُّ إِلَّا الْيَوْمَ، فَنَزَلَ مِنْهُ مَلَكٌ، فَقَالَ: هَذَا مَلَكٌ نَزَلَ إِلَى الْأَرْضِ لَمْ يَنْزِلْ قَطُّ إِلَّا الْيَوْمَ، فَسَلَّمَ، وَقَالَ: أَبْشِرْ بِنُورَيْنِ أُوتِيتَهُمَا لَمْ يُؤْتَهُمَا نَبِيٌّ قَبْلَكَ: فَاتِحَةُ الْكِتَابِ، وَخَوَاتِيمُ سُورَةِ الْبَقَرَةِ، لَنْ تَقْرَأَ بِحَرْفٍ مِنْهُمَا إِلَّا أُعْطِيتَهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 806]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
“జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నపుడు పైన ‘కిర్రు’ మనే శబ్దం విన్నారు. ఆయన తన తలపైకి ఎత్తి చూసి, ఇలా అన్నారు: “ఇది స్వర్గములోని ఒక ద్వారము; అది ఈ రోజు తెరుచుకున్నది, ఈ రోజు తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ ఆ ద్వారము తెరువబడలేదు”; ఆ ద్వారము నుండి ఒక దైవదూత దిగి వచ్చినాడు. ఆయన (జిబ్రీల్) ఇలా అన్నారు: “ఆయన దైవదూత, ఆ దైవదూత ఈ రోజే భూమిపై దిగివచ్చినాడు, ఈ దినము తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ అతడు భూమి మీదకు రాలేదు. అతడు (ఆ దైవదూత) సలాం చేసి ఇలా అన్నాడు: “మీకు ప్రసాదించబడుతున్న రెండు కాంతి పుంజముల శుభవార్తను స్వీకరించండి; మీకు ముందు ఏ సందేశహరునికీ ఇవి ఇవ్వబడలేదు: ‘ఫాతిహతుల్ కితాబ్’ (సూరహ్ ఫాతిహా), మరియు సూరహ్ అల్ బఖరహ్ యొక్క చివరి ఆయతులు. దాని నుండి మీరు ఒక్క అక్షరం పఠించినా అది (దాని ప్రతిఫలం) మీకు ఇవ్వబడుతుంది.”
[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 806]
జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చుని ఉన్నపుడు ఆయన స్వర్గము నుండి ఏదో తలుపు తెరువబడున్న శబ్దం విన్నారు. ఆ శబ్దం విని జిబ్రయీల్ అలైహిస్సలాం తన తలను పైకి ఎత్తి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇలా తెలిపినారు – అది స్వర్గములోని ఒక ద్వారము, అది ఈ రోజు తెరువబడినది, ఇంతకు మునుపు ఎప్పుడూ తెరువబడలేదు. ఆ ద్వారము నుండి ఒక దైవదూత భూమి మీదకు దిగివచ్చినాడు. అతడు అంతకు మునుపు ఎన్నడూ భూమి మీదకు దిగిరాలేదు. ఆ దైవదూత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సలాం చేసి ఇలా పలికినాడు: “నేను మీకు అందజేసిన మరియు మీ కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవ్వబడని రెండు వెలుగుకిరణాల శుభవార్త పట్ల సంతోషించండి. అవి సూరతుల్ ఫాతిహా మరియు సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు.” అప్పుడు ఆ దైవదూత ఇలా అన్నాడు: ఎవరైనా ఆ రెండింటిలో నుండి ఒక్క అక్షరం పఠించినా, సర్వోన్నతుడైన అల్లాహ్ అతనికి వాటిల్లో ఉన్న మంచిని, దుఆలను, వేడుకోళ్ళను అతనికి ప్రసాదిస్తాడే తప్ప, అలా ప్రసాదించకుండా ఉండడు.