عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عنه سَمِعْتُ رَسُولَ اللهِ صلى الله عليه وسلم يَقُولُ:
«قَالَ اللهُ تَعَالَى: قَسَمْتُ الصَّلَاةَ بَيْنِي وَبَيْنَ عَبْدِي نِصْفَيْنِ، وَلِعَبْدِي مَا سَأَلَ، فَإِذَا قَالَ الْعَبْدُ: {الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ}، قَالَ اللهُ تَعَالَى: حَمِدَنِي عَبْدِي، وَإِذَا قَالَ: {الرَّحْمَنِ الرَّحِيمِ}، قَالَ اللهُ تَعَالَى: أَثْنَى عَلَيَّ عَبْدِي، وَإِذَا قَالَ: {مَالِكِ يَوْمِ الدِّينِ}، قَالَ: مَجَّدَنِي عَبْدِي، -وَقَالَ مَرَّةً: فَوَّضَ إِلَيَّ عَبْدِي-، فَإِذَا قَالَ: {إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}، قَالَ: هَذَا بَيْنِي وَبَيْنَ عَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ، فَإِذَا قَالَ: {اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ}، قَالَ: هَذَا لِعَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 395]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా విన్నానని అన్నారు :-
“సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది.” (తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:) “(నమాజులో) దాసుడు “అల్-హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను కీర్తించినాడు”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు”; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “నా దాసుడు నన్ను మహిమ పరిచినాడు”; ఆయన ఇంకా ఇలా అంటాడు: “నా దాసుడు తన వ్యవహారాలన్నింటినీ నాకు అప్పగించినాడు”; దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, ఆయన “ఇది నాకు, నా దాసునికి మధ్య నున్న విషయం, నా దాసుడు తాను అర్థించిన దానిని పొందుతాడు” అంటాడు, దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “ఇది నా దాసుని కొరకు; నాదాసునికి అతడు అర్థించినది ప్రసాదించబడుతుంది.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 395]
ఈ హదీసుల్ ఖుద్సీలో అల్లాహ్ ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినారు: ‘నేను సూరతుల్ ఫాతిహాను నాకు మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను, అందులో ఒక సగభాగము నా కొరకు, మరియు మరొక సగభాగము అతని కొరకు.”
మొదటి సగభాగము: అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించుట, ఆయనను మహిమపరుచుట. అందుకొరకు నేను అతనికి ప్రతిఫలములలో శుభప్రదమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను.
రెండవ సగభాగము: దుఆ అంటే మొరపెట్టుకొనుట. నేను అతని మొరను ఆలకిస్తాను మరియు అతడు అర్థించిన దానిని ప్రసాదిస్తాను.
సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి “అల్’హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు అల్లాహ్ “నా దాసుడు నన్ను కీర్తించినాడు” అని అంటాడు; ”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు, మరియు సృష్ఠి మొత్తంపై ఉన్న నా అనుగ్రహాన్ని, కరుణను అతడు గుర్తించినాడు” అని అంటాడు; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, అల్లాహ్ “నా దాసుడు నన్ను కొనియాడినాడు, మరియు అది ఒక గొప్ప గౌరవం” అంటాడు.
దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, అల్లాహ్ “ఇది నాకు, నా దాసునికి మధ్యనున్న విషయం” అంటాడు.
ఈ ఆయతులో మొదటి సగభాగము (ఇయ్యాక న’బుదు – ‘మేము కేవలం నిన్నే (నిన్ను మాత్రమే) ఆరాధిస్తాము’) అల్లాహ్ కు చెందినది. ఇందులో ‘అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు నిజమైన అర్హుడు’ అనే దాసుని ఒప్పుకోలు, మరియు దానికి జవాబుగా అతడు అల్లాహ్ ను ఆరాధించుట ఉన్నాయి – దానితో (సూరతుల్ ఫాతిహాలో) అల్లాహ్ కు చెందిన మొదటి సగభాము ముగుస్తుంది.
ఈ ఆయతులో రెండవ సగభాగము – అది దాసునికి చెందినది: (ఇయ్యాక నస్తఈన్) ఇందులో అల్లాహ్ నుండి సహాయం కొరకు అర్థింపు ఉన్నది. మరియు అది అతనికి ప్రమాణం చేయబడింది.
దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం*, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు: “ఇది నా దాసుని దుఆ మరియు అతడు నాకు పెట్టుకునే మొర. అతడు అర్థించినది అతనికి ప్రసాదించబడుతుంది, మరియు నిశ్చయంగా అతడు అర్థించిన దానిని నేను ప్రసాదించాను.”