عن أَبي هُرَيْرَةَ رضي الله عنه:
أنه كَانَ يُكَبِّرُ فِي كُلِّ صَلَاةٍ مِنَ الْمَكْتُوبَةِ وَغَيْرِهَا، فِي رَمَضَانَ وَغَيْرِهِ، فَيُكَبِّرُ حِينَ يَقُومُ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْكَعُ، ثُمَّ يَقُولُ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، ثُمَّ يَقُولُ: رَبَّنَا وَلَكَ الْحَمْدُ، قَبْلَ أَنْ يَسْجُدَ، ثُمَّ يَقُولُ: اللهُ أَكْبَرُ حِينَ يَهْوِي سَاجِدًا، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْفَعُ رَأْسَهُ مِنَ السُّجُودِ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَسْجُدُ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْفَعُ رَأْسَهُ مِنَ السُّجُودِ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَقُومُ مِنَ الْجُلُوسِ فِي الِاثْنَتَيْنِ، وَيَفْعَلُ ذَلِكَ فِي كُلِّ رَكْعَةٍ، حَتَّى يَفْرُغَ مِنَ الصَّلَاةِ، ثُمَّ يَقُولُ حِينَ يَنْصَرِفُ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ، إِنِّي لَأَقْرَبُكُمْ شَبَهًا بِصَلَاةِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، إِنْ كَانَتْ هَذِهِ لَصَلَاتَهُ حَتَّى فَارَقَ الدُّنْيَا.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 803]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రతి ఫర్జ్ నమాజులోనూ, ప్రతి సున్నత్ మరియు నఫీల్ నమాజులోనూ, రమజాన్ నెలలో అయినా, లేక ఇతర నెలలలో అయినా “అల్లాహు అక్బర్” అని పలికేవారు. ఆయన (నమాజు కొరకు) లేచి నిలబడినపుడు “అల్లాహు అక్బర్” అని పలికేవారు, రుకూ చేయునపుడు “అలాహు అక్బర్” అని పలికేవారు. రుకూ నుండి లేచునపుడు “సమియల్లాహు లిమన్ హమిదహ్” అని, సజ్దాహ్ లోనికి వెళ్ళుటకు ముందు “రబ్బనా లకల్ హంద్” అని పలికేవారు. తరువాత సజ్దాహ్ చేయుట కొరకు వంగునపుడు “అల్లాహు అక్బర్” అని పలికి సజ్దాహ్ చేసేవారు. తరువాత సజ్దాహ్ నుండి తల పైకి లేపునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికేవారు. తిరిగి సజ్దాహ్ చేయునపుడు తక్బీర్ పలికి సజ్దాహ్ చేసేవారు. తరువాత సజ్దాహ్ నుండి తలపైకి లేపునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికేవారు; తరువాత కూర్చుని ఉన్న స్థితి నుండి పైకి లేచునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) అని రెండు సందర్భాలలోనూ పలికేవారు. సలాహ్ (నమాజు) ముగించే వరకూ ప్రతి రకాతులోనూ ఆయన ఈ విధంగా ఆచరించేవారు. అపుడు (నమాజు ముగించిన తరువాత) వెళ్ళునపుడు ఆయన ఇలా అనేవారు “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో ఆయన సాక్షిగా – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు మీ అందరిలో నిశ్చయంగా నేను అత్యంత దగ్గరిగా ఉన్నాను. ఈ ప్రపంచం నుండి వెడలిపోయేటంత వరకు ఆయన నమాజు ఈ విధంగానే ఉండినది”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 803]
ఇందులో అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో కొద్ది భాగాన్ని వివరిస్తూ, ఇలా అంటున్నారు: నమాజు కొరకు లేచి (నిలబడి) నపుడు “తక్బీరతుల్ ఇహ్రాం” (నమాజు ప్రారంభించుటకు మొదటి సారి “అల్లాహు అక్బర్” అని) పలుకుతారు, తరువాత రుకూ కొరకు వంగునపుడు, సజ్దా చేయునపుడు, సజ్దాహ్ నుండి తల పైకి ఎత్తునపుడు, రెండవ సారి సజ్దాహ్ చేయునపుడు, మరియు దాని నుండి తల పైకి లేపునపుడు, మరియు మూడు రకాతుల లేక నాలుగు రకాతుల నమాజులో, రెండవ రకాతులో మొదటి తషహ్హుద్ తరువాత పైకి లేచునపుడు “అల్లాహు అక్బర్” అని పలుకుతారు; ఇలా ఆయన సలాహ్ (నమాజు) ముగించే వరకూ ఇలాగే ఆచరిస్తారు. రుకూ నుండి తన నడుమును పైకి లేపునపుడు “సమియల్లాహు లిమన్ హమిదహ్” అని, రుకూ నుండి పూర్తిగా పైకి లేచి నిలబడినపుడు “రబ్బనా లకల్ హంద్” అని పలుకుతారు.
నమాజు ముగించిన తరువాత అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఇలా అనేవారు “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – ఒకవేళ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచం నుండి వెడలి పోయేటంత వరకు, వారి నమాజు విధానం అయితే, సారూప్యతలో మీ అందరిలో ఆయన నమాజు విధానానికి నేను అతి చేరువగా ఉన్నాను”.