+ -

عَنِ ‌ابْنِ أَبِي أَوْفَى رضي الله عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا رَفَعَ ظَهْرَهُ مِنَ الرُّكُوعِ قَالَ: «سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ، مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

ఇబ్న్ అబీ ఔఫా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
"c2">“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ నుండి తన నడుమును పైకి లేపునపుడు ఇలా పలికినారు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్, అల్లాహుమ్మ, రబ్బనా లకల్ హందు, మిల్’అస్సమావాతి, వ మిల్ అల్ అర్ధి, వ మిల్ అమా షి’త మిన్ షైఇన్ బ’ద్” (తనను స్తుతించిన వారి స్తోత్రములను అల్లాహ్ విన్నాడు. ఓ అల్లాహ్! మా ప్రభువా! సకల స్తోత్రములూ నీ కొరకే, ఆకాశాన్ని నింపినంత, భూమిని నింపినంత మరియు ఆ తర్వాత నీవు కోరుకున్నంత స్తోత్రం నీకొరకే).”

దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

పలికేవారు "c2">“సమి’అల్లాహు లిమన్ హమిదహ్”; (అల్లాహ్ తనను స్తుతించిన వాని స్తోత్రములను విన్నాడు); అంటే ఎవరైతే సర్వోన్నతుడైన అల్లాహ్ ను స్తుతిస్తాడో, అతని ప్రార్థనలకు అల్లాహ్ స్పందిస్తాడు, అతని స్తోత్రములను స్వీకరిస్తాడు మరియు అతనికి ప్రసాదిస్తాడు అని అర్థం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పదాలతో అల్లాహ్’ను స్తుతించేవారు "c2">“అల్లాహుమ్మ, రబ్బనా లకల్ హంద్, మిల్ అస్సమావాతి, వ మిల్ అల్ అర్ది, వ మిల్ అమా షి’త మిన్ షఇన్ బ’దు” (ఓ అల్లాహ్! మా ప్రభువా! సకల స్తోత్రములూ నీకొరకే, ఆకాశాన్ని నింపినంత, భూమిని నింపినంత మరియు ఆ తర్వాత నీవు కోరుకున్నంత స్తోత్రం నీకొరకే). స్తోత్రము – దానితో ఆకాశాలు నిండిపోయేటంత, భూమి అంతా నిండి పోయేటంత, ఆ రెంటి మధ్యనున్న దంతా ఆ స్తోత్రముతో నిండిపోయేటంత – ఆ తరువాత అల్లాహ్ ఆ మొత్తాన్ని తాను దేనితో నింపాలని తలిస్తే దానితో నింపుతాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ టర్కిష్ సింహళ హిందీ వియత్నమీస్ హౌసా స్వాహిలీ బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية القيرقيزية النيبالية اليوروبا الليتوانية الدرية الصومالية الكينياروندا
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో, నమాజులో ఉన్న వ్యక్తి రుకూ స్థితి నుండి పైకి లేచుట కొరకు తన తల పైకి ఎత్తినపుడు పలుకవలసిన అభిలషణీయమైన పదాలను గురించి తెలుపబడినది.
  2. ఇందులో రుకూ స్థితి నుంచి పైకి లేచునపుడు, మరియు పూర్తిగా లేచిన తరువాత ప్రశాంతత, స్థిరత్వం, నిశ్చలత్వం తొందరపాటు లేని తనం, ఉండాలని ఈ షరియత్ ఆదేశములో కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రశాంతత, తొందరపాటు లేని తనం లేకపోతే దాసుడు ఈ అజ్’కార్’లను (స్తోత్రపు వాక్యాలను) పూర్తిగా పలుకలేడు.
  3. అల్లాహ్ ను స్తుతించుట, ఆయనకు చెందిన స్తోత్రములను పఠించుట, పలుకుట ఫర్జ్, సున్నత్, నఫీల్ అనే భేదము లేకుండా అన్ని సలాహ్ (నమాజు) లలోనూ చేయవచ్చును.
ఇంకా