+ -

عَنْ وَائِل بن حُجرٍ رضي الله عنه قَالَ:
صَلَّيْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَكَانَ يُسَلِّمُ عَنْ يَمِينِهِ: «السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ»، وَعَنْ شِمَالِهِ: «السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ».

[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 997]
المزيــد ...

వాయిల్ ఇబ్న్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజు ఆచరించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించుట కొరకు సలాం చెప్పినపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు అనుగ్రము మీపై కురియుగాక) అని, మరియు తన ఎడమ వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” (అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ మీపై కురియుగాక) అని పలికినారు.”

[ప్రామాణికమైనది] - [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు] - [سنن أبي داود - 997]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నమాజు ముగించాలని అనుకున్నప్పుడు, తన కుడి మరియు ఎడమ వైపునకు తన ముఖాన్ని తిప్పి సలాం చేసేవారు, అపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (మీపై శాంతి, అల్లాహ్ కరుణ మరియు ఆయన ఆశీర్వాదాలు కురియుగాక) అని, మరియు ఎడమ వైపునకు తన ముఖాన్ని తిప్పి సలాం చేసినపుడు, “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” ("మీపై అల్లహ్ యొక్క శాంతి మరియు కరుణ) కురియుగాక అని పలికేవారు.

من فوائد الحديث

  1. నమాజులో రెండుసార్లు ‘సలాం’ చెప్పుట షరియత్’లోని భాగమే. ఇది నమాజు యొక్క మూలస్థంభాలలో (అర్కానులలో) ఒకటి.
  2. నమాజు ముగించుట కొరకు సలాం చెప్పునపుడు ఆ పదాలలో అప్పుడప్పుడు “వబరకాతుహు” (మరియు ఆశీర్వాదాలు) అనే పదాన్ని కలిపి పలుకవచ్చును, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడో ఒకసారి తప్ప, నిరంతరం ప్రతీసారి అలా పలుకలేదు.
  3. రెండుసార్లు సలాం పలుకుట నమాజు యొక్క మూలస్థంభాలలో (అర్కాన్’లలో) ఒకటి, అయితే సలాం పలుకునపుడు తలను కుడివైపునకు, ఎడమ వైపునకు త్రిప్పుట అభిలషణీయము.
  4. “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” అని పలుకుట తలను కుడివైపునకు, ఎడమవైపునకు త్రిప్పుతున్నపుడు జరగాలి, పలుకుటకు ముందుగానో లేక పలికిన తరువాతనో కాదు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية النيبالية الدرية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా