عن ابن عباس رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال: «أمِرْت أن أسْجُد على سَبْعَة أعَظُم على الجَبْهَة، وأشار بِيَده على أنْفِه واليَدَين والرُّكبَتَين، وأطْرَاف القَدَمين ولا نَكْفِتَ الثِّياب والشَّعر».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖిస్తున్నారు మహనీయ ప్రవక్త తెలియపర్చారు“నాకు ఏడు ఎముకల పై సాష్టాంగ పడాలని ఆదేశించడం జరిగింది“ నుదుటి పై అంటూ ముక్కు వరకు సైగ చేశారు,రెండు చేతులు,రెండు మోకాళ్ళు,రెండు పాదాల కొనలు,దుస్తులు మరియు జుట్టును తిరిగి మడవటం మాకు నిషేధించబడింది.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

హదీసు అర్ధం :"أمِرْت أن أسْجُد" నేను సజ్దా చేయాలని’ఆదేశించబడినది,మరొక ఉల్లేఖనంలో"أُمرنا" ఇంకో ఉల్లేఖనంలో"أَمَر النبي -صلى الله عليه وسلم-"అని ఉంది అయితే ఈ మూడు ఉల్లేఖనములు సహీ బుఖారి కు చెందినవి.షరీఅతు యొక్క మూల సూత్రాల్లో ఒకటి- మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఎవరికైన ఏదైన ఆదేశం ఇస్తే అది ఆ వ్యక్తితో పాటు పూర్తి ఉమ్మతు కు కూడా ఆదేశంగా మారుతుంది,"على سَبْعَة أعَظُم"(ఏడు ఎముకల పై) అనగా నాకు ఏడు అవయవాల ఆధారంగా సజ్దా చేయమని ఆదేశించబడినది’ అల్ అజము’అనగా ఒక ఉల్లేఖనంలో విశదీకరించిన ప్రకారం ‘సజ్దా చేయు అవయువములు'ఆ విషయాన్ని వివరిస్తూ"على الجَبْهَة" అలల్ జబహతి’ అని వచ్చింది అనగా ‘నాకు నుదుటి తో పాటు ముక్కు పై సజ్దా చేయమని ఆదేశించడం జరిగింది,దీన్ని ఈ మాట"وأشار بِيَده على أنْفِه" {తన చేతిని ముక్కు వైపుకు సైగ చేశారు}దృవీకరిస్తుంది,అనగా తన ముక్కు వైపుకు సైగ చేస్తూ ఈ రెండూ ఒకే భాగము అని భోదించారు,"واليَدَين" రెండు చేతులు ‘అనగా రెండు బాహ్య అరిచేతులు,సాదారణంగా అందరికీ అర్దమయ్యేవి, "والرُّكبَتَين وأطْرَاف القَدَمين" రెండు మోకాళ్ళు మరియు పాదాల కొనలు’ అనగా ‘నాకు రెండు మోకాళ్ళ పై మరియు పాదముల వేళ్ళ పై సజ్ద చేయమని ఆదేశించబడినది’ అబూ హుమైద్ అస్సాయిది రదియల్లాహు అన్హు యొక్క కథనం-సిఫతు స్సలాతు అద్యాయములు”లో ఈ పదాలు వచ్చాయి - (واسْتَقبل بأصابع رِجْلَيه القِبْلَة) పాదాల వేళ్ళు ఖిబ్లా వైపుకు మరల్చాలీ’ అనగా సజ్దా చేస్తున్నప్పుడు. "ولا نَكْفِتَ الثِّياب والشَّعر" “దుస్తులు మరియు జుట్టును తిరిగి మడవటం మాకు నిషేధించబడింది’-الكَفْت అనగా ‘విలీనం మరియు అనుసంధానం’చేయడం,అర్ధము :మేము దుస్తులను మరియు వెంట్రుకలను రుకూ మరియు సజ్దా చేసేటప్పుడు విస్తరించకుండా అనుసంధానించకూడదు,విలీనపర్చకూడదు వాటిని అలాగే నేలపై వదిలేయమని తద్వారా సమస్త అవయవాలతో దుస్తులు మరియు వెంట్రుకలతో పాటు సజ్దా చేయమని చెప్పబడింది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. నమాజులో ఏడు (ఎముకలపై)భాగాలపై సజ్దా చేయడం తప్పనిసరి వాజిబు,ఎందుకంటే ఆజ్ఞ యొక్క అసలు వాజిబును సూచిస్తుంది.
  2. నుదురు లేకుండా ముక్కును,లేక ముక్కు లేకుండా నుదురు తో సజ్దా చేస్తే అది సంపూర్ణమవ్వదు,ఎందుకంటే మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ నుదురు గురించి ప్రస్తావించినప్పుడు ముక్కు వైపుకు సైగచేశారు.
  3. అన్నీ అవయవలపై సజ్దా చేయడం తప్పనిసరి వాజిబు విధి,అందులో కొన్నింటితో చేస్తే అదిచాలదు,నుదురు నేలపై సాధ్యమైనంతగా పెట్టాలి.
  4. ఈ హదీసులో స్పష్టమైన విషయం ఏమిటంటే: ప్రస్తావించబడిన దానిలో ఏ అవయవమును బహిర్గతపర్చడం వాజిబు విధి కాదు,ఎందుకంటే ఆ అవయవాలతో సజ్దా చేయడమంటే వాటిని బహిర్గతపర్చకుండా నేలపై పెట్టడమని,వాస్తవానికి అది ఔరా' బహిర్గతమవుతుందన్న భయం కల్గినప్పుడు రెండుమోకళ్లను బహిర్గతపర్చడం విధి కాదు,ఇలాగే రెండు పాదాలకు మేజోల్లతో నమాజు చేయడానికి అనుమతి కూడా ఉంది.
  5. నమాజులో దుస్తులను మడచి ఉంచడము అయిష్టకరముగా చెప్పబడింది.
  6. వెంట్రుకలను ముడివేసుకోవడం మెడకు వెనుక కట్టుకోవడం అది నమాజు కొరకు ప్రత్యేకంగా కట్టిన లేక నమాజు కు ముందు అలా కట్టి దాంతో నమాజు చదివిన లేక కట్టేఅవసరం లేకుండా అదే స్థితిలోనమాజు చేసిన అయిష్టకరమైన చర్యగా పరిగణించ బడుతుంది.