عَنْ عَائِشَةَ أُمِّ المؤمنين رضي الله عنها:
أَنَّ أُمَّ سَلَمَةَ ذَكَرَتْ لِرَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَنِيسَةً رَأَتْهَا بِأَرْضِ الْحَبَشَةِ، يُقَالُ لَهَا مَارِيَةُ، فَذَكَرَتْ لَهُ مَا رَأَتْ فِيهَا مِنَ الصُّوَرِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أُولَئِكَ قَوْمٌ إِذَا مَاتَ فِيهِمُ الْعَبْدُ الصَّالِحُ، أَوِ الرَّجُلُ الصَّالِحُ، بَنَوْا عَلَى قَبْرِهِ مَسْجِدًا، وَصَوَّرُوا فِيهِ تِلْكَ الصُّوَرَ، أُولَئِكَ شِرَارُ الْخَلْقِ عِنْدَ اللهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 434]
المزيــد ...
ఉమ్ముల్ ము'మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
“ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 434]
ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా – తాను అబిసీనియాలో ఉన్నపుడు మారియా అని పిలువబడే ఒక చర్చిని చూసిన విషయాన్ని, అందులో విగ్రహాలు, చిత్రపటాలు, వివిధ రకాల అలంకరణలు చూసిన విషయాన్ని, వాటిని చూసి తాను అబ్బురపడిన విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విగ్రహాలు, చిత్రపటాలు అక్కడ చర్చిలో పెట్టి ఉండడం వెనుక ఉన్న కారణాలను వివరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారిలో ఒక నీతిమంతుడు మరణిస్తే, వారు అతని సమాధిపై ఒక ఆరాధనాలయాన్ని (మస్జిదును) నిర్మించి, అందులో ప్రార్థనలు చేస్తారు. వారు అతని విగ్రహాన్ని, చిత్రపటాన్ని అందులో ఉంచుతారు. తరువాత ఆయన ఇలా విశదపరిచినారు: అలా చేసేవాడు అల్లాహ్ దృష్టిలో సృష్టిలోకెల్లా అత్యంత నీచుడు. ఎందుకంటే అతని ఆ ఆచరణ సర్వోన్నతుడైన అల్లాహ్ తో షిర్క్ చేయడానికి దారి తీస్తుంది (అంటే అల్లాహ్ కు సాటిగా, సమానులుగా వేరే వారిని నిలబెట్టుట).