عن جندب بن عبد الله رضي الله عنه قال: سمعت النبي صلى الله عليه وسلم قبل أن يموت بخمس، وهو يقول: «إني أبرأ إلى الله أن يكون لي منكم خليل، فإن الله قد اتخذني خليلا كما اتخذ إبراهيم خليلا، ولو كنت متخذا من أمتي خليلا لاتخذت أبا بكر خليلا، ألا وإن من كان قبلكم كانوا يتخذون قبور أنبيائهم مساجد، ألا فلا تتخذوا القبور مساجد، فإني أنهاكم عن ذلك».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

జూన్దుబ్ ఇబ్నె అబ్దుల్లా రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త ద్వారా విన్న విషయాన్ని ఉల్లేఖిస్తూ తెలుపుతున్నారు“అల్లాహ్ (సు త) మహోన్నత వల్ల మీలో ఎవరిని నా మిత్రునిగా చేసుకోలేకపోతున్నాను,అల్లాహ్ (సు త)ఇబ్రాహీం అలైహిస్సలమ్ ను చేసుకున్నమాదిరిగా నన్ను తన మిత్రునిగా చేసుకున్నాడు,ఒకవేళ మిత్రునిగా చేసుకునే అవకాశం నాకు ఉంటే నేను అబుబకర్ ని మిత్రునిగా చేసుకునేవాడను.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన మరణానికి ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియపర్చారు,అల్లాహ్ వద్ద తనకు గల ప్రత్యేక స్థానాన్ని గురించి తెలియపరుస్తూ’: ఇబ్రాహీం అలైహిస్సలాం కు అల్లాహ్ వద్ద గల ప్రాధాన్యత మాదిరిగా ప్రేమ యొక్క గొప్ప స్థానానికి చేరుకున్నట్లు తెలియజేశారు,అంచేత తనకు అల్లాహ్ తప్ప మరొక ‘ఖలీల్’(మిత్రుడు)లేడు అని చెప్పారు ఎందుకంటే ప్రవక్త హృదయం అల్లాహ్ గొప్పతనం,మహత్యం మరియు ప్రేమ తో నిండి ఉన్నాయి,అందులో మరొకరి కొరకు చోటు లేదు,మనుషుల్లో మిత్రుత్వం అనేది కేవలం ఒక్కరి కొరకే ఉంటుంది,సృష్టిలో ప్రవక్తకు ఎవరైనా మిత్రుడై ఉంటే అది అబూబకర్ అయి ఉండేవాడు,ఇందులో అబూబకర్ రజియల్లాహు అన్హు యొక్క ప్రాధాన్యత మరియు ప్రవక్త తదనంతరం ఖలీఫా అవుతారన్న సూచన ఉంది,ఆ పై తరువాత దైవప్రవక్త యూదులు మరియు క్రైస్తవులు చేసిన అతిశయోక్తి గురించి తెలియజేస్తూ వారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధ్యమందిరాలుగా మార్చుకున్నారు అని చెప్పారు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తమ జాతిప్రజలకు ఇలా చేయకూడదని వారించారు,క్రైస్తవుల ప్రవక్త ఈసా అలైహిస్సాలమ్ కూడా ఒక్కడే,వారి నమ్మకం ఆధారంగా ఈసా వారి సమాధి భూమి మీద ఉంది అని నమ్ముతున్నారు,ఇక్కడ ‘అంబియా’అనే బహువచనం-పూర్తి సముదాయంగా భావించి ఉపయోగించబడింది,వాస్తవానికి ఈసా అలైహిస్సలామ్ ‘ఆకాశానికి ఎత్తుకోబడ్డారు,శిలువ వేయబడలేదు,సమాధి చేయబడలేదు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ‘ముహబ్బత్’-ప్రేమ అనే గుణాన్ని పరిశుద్దుడైన అల్లాహ్ కొరకు తెలుపుతూ ఆయన పవిత్రతకు తగిన విధంగా రుజువు చేయబడింది.
  2. ‘అల్-ఖళీలైన్’-ముహమ్మద్ మరియు ఇబ్రాహీం అలైహిమస్సలాం- యొక్క ప్రాముఖ్యత తెలుపబడినది.
  3. అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వారి ప్రాముఖ్యత తెలుపబడింది,ఆయన ఈ ఉమ్మత్’లోనే శ్రేష్టుడు.
  4. ఇందులో అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ‘ఖలీఫా’ అవుతారనే విషయానికి సాక్ష్యం ఉంది.
  5. అల్లాహ్ కు మరియు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు మధ్యగల స్నేహాన్నితెలుపుతుంది
  6. వాస్తవానికి సమాధుల పై మస్జిదులు నిర్మించడం గతించిన జాతులకు చెందిన సాంప్రదాయం.
  7. ఈ హదీసులో సమాధులను ఆరాధన నిలయాలుగా నిర్మించడాన్ని వారించబడింది,ఎందుకంటే వాటి వద్ద నమాజు చేయడం,వాటికొరకు ప్రార్ధనలు చేయడం మరియు వాటిపై మస్జిదులు లేదా గుంబద్ లు నిర్మించడం షిర్కు యొక్క ముఖ్య కారణాలు కాబట్టి.
  8. ఈ హదీసులో ‘షిర్కు కు దరిచేర్చే కారకాల నిరోధకం’ఉంది
ఇంకా