హదీథుల జాబితా

నేను మీకు అల్లాహ్ పట్ల భయభక్తులను కలిగి ఉండమని, మరియు ఒక బానిస మీపై నాయకుడిగా నియమించబడినప్పటికీ, అతడి మాట వినమని మరియు విధేయత చూపమని ఉపదేశిస్తున్నాను. నిశ్చయంగా, నా తర్వాత మీలో ఎవరైతే జీవిస్తారో, వారు అనేక విభేదాలను చూస్తారు. కాబట్టి, నా సంప్రదాయాన్ని (సున్నత్) మరియు సన్మార్గం పొందిన, సరైన మార్గంలో నడిచిన ఖలీఫాల సంప్రదాయాన్ని మీరు తప్పనిసరిగా అనుసరించండి
عربي الإنجليزية الأوردية
నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు
عربي الإنجليزية الأوردية
అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి
عربي الإنجليزية الأوردية
“అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కపట విశ్వాసి తప్ప వారిని ఎవరూ ద్వేషించరు. వారిని (అన్సారులను) ఎవరైతే ప్రేమిస్తారో, అల్లాహ్ అతడిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే వారిని ద్వేషిస్తాడో అల్లాహ్ అతడిని ద్వేషిస్తాడు.”
عربي الإنجليزية الأوردية
“నిశ్చయంగా, అల్లాహ్‌ను మరియు అతని ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి నేను ఈ జెండా ఇస్తాను మరియు అల్లాహ్ అతని చేతుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు”
عربي الإنجليزية الأوردية
“నా సహాబాలను అవమానించకండి (వారి పట్ల అవమానకరంగా మాట్లాడకండి), మీలో ఎవరైనా ఉహుద్ కొండంత బంగారాన్ని ఖర్చు చేసినా, అది వారిలో (సహాబాలలో) ఒకరు ఖర్చు చేసిన ‘ముద్’ లేక కనీసం ‘ముద్’లో సగం అంత దానికి కూడా సమానం కాదు.”
عربي الإنجليزية الأوردية
“బద్ర్ (యుధ్ధం) మరియు హుదైబియహ్ (ఒప్పందము) లలో ఎవరైతే పాల్గొన్నాడో అతడు ఎన్నడూ నరకాగ్ని లోనికి ప్రవేశించడు.”
عربي الإنجليزية الأوردية
“అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) లను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వీరిద్దరూ స్వర్గములో పెద్దవారికందరికీ నాయకులు - మొదటి తరం నుండి మొదలుకుని చివరితరం వరకూ, అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులకు తప్ప.”
عربي الإنجليزية الأوردية
అతని వద్దకు వెళ్ళు, వెళ్ళి ‘నీవు నరకవాసులలోని వాడవు కావు, నీవు స్వర్గవాసులలోని వాడవు” అని అతనికి చెప్పు.”
عربي الإنجليزية الأوردية
నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం కలిగించలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను
عربي الإنجليزية الأوردية
మీలో ఉత్తములు నా తరం వారు (సహాబాలు), తర్వాత వారిని అనుసరించే వారు (తాబియీన్), తర్వాత వారిని అనుసరించే వారు (అతబ్బ తాబియీన్)
عربي الإنجليزية الإندونيسية