عن جابر رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«لن يدخلَ النارَ رجلٌ شَهِد بدرًا والحُدَيْبِيَة».
[صحيح] - [رواه أحمد، وأصله في صحيح مسلم] - [مسند أحمد: 15262]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“బద్ర్ (యుధ్ధం) మరియు హుదైబియహ్ (ఒప్పందము) లలో ఎవరైతే పాల్గొన్నాడో అతడు ఎన్నడూ నరకాగ్ని లోనికి ప్రవేశించడు.”
[దృఢమైనది] - [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [مسند أحمد - 15262]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: హిజ్రీ రెండవ సంవత్సరంలో జరిగిన బదర్ యుద్ధంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి పోరాడిన లేదా హిజ్రీ ఆరవ సంవత్సరంలో రిద్వాన్ ప్రతిజ్ఞతో కూడిన హుదైబియా ఒప్పందంలో పాల్గొన్న ఎవరైనా నరకంలో ప్రవేశించరని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రకటించారు.