عَنِ الْبَرَاءِ رضي الله عنه:
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ فِي الْأَنْصَارِ: «لَا يُحِبُّهُمْ إِلَّا مُؤْمِنٌ، وَلَا يُبْغِضُهُمْ إِلَّا مُنَافِقٌ، مَنْ أَحَبَّهُمْ أَحَبَّهُ اللهُ وَمَنْ أَبْغَضَهُمْ أَبْغَضَهُ اللهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 75]
المزيــد ...
అల్ బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కపట విశ్వాసి తప్ప వారిని ఎవరూ ద్వేషించరు. వారిని (అన్సారులను) ఎవరైతే ప్రేమిస్తారో, అల్లాహ్ అతడిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే వారిని ద్వేషిస్తాడో అల్లాహ్ అతడిని ద్వేషిస్తాడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 75]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మదీనా వాసులలో అన్సారుల పట్ల ప్రేమను కలిగి ఉండుట అన్నది సంపూర్ణమైన విశ్వాసానికి నిదర్శనం. ఇది ఎందుకంటే (అత్యంత కష్ట కాలములో) వారు ముందడుగు వేసి ఇస్లాంకు మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సహాయంగా, మద్దతుగా నిలబడినారు, (మదీనాకు వలస వచ్చిన) ముస్లిములకు శ్రమకోర్చి ఆశ్రయం కల్పించారు, వారికి ధన సహాయం చేసినారు, మరియు అల్లాహ్ మార్గములో ప్రాణలను సైతం అర్పించినారు. వారిని ద్వేషించడం కపటత్వానికి నిదర్శనం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఎవరైతే అన్సారులను ప్రేమిస్తాడో అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే అన్సారులను ద్వేషిస్తాడో, అల్లాహ్ వారిని ద్వేషిస్తాడు – అని వివరించారు.