عَن زَيْدِ بْنِ خَالِدٍ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ جَهَّزَ غَازِيًا فِي سَبِيلِ اللَّهِ فَقَدْ غَزَا، وَمَنْ خَلَفَ غَازِيًا فِي سَبِيلِ اللَّهِ بِخَيْرٍ فَقَدْ غَزَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2843]
المزيــد ...
జైద్ ఇబ్న్ ఖాలిద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో పాల్గొన్నట్లే; మరియు ఆ యోధుడి గైరుహాజరీలో, అతనిపై ఆధారపడిన వారిని ఎవరు సరిగ్గా చూసుకుంటారో అతడు కూడా నిజంగా పోరాటంలో పాల్గొన్నట్లే.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2843]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అల్లాహ్ మార్గంలో పోరాడే ఒక యోధుని కొరకు – ఎవరైతే ప్రయాణ సాధనాలు, ఆయుధాలు, వాహనం, ఆహారం, ఆహారపదార్థాలు, ఇంకా అతనికి అవసరమైన ఇతర వస్తువులతో సహా ఆ యోధుడిని సిద్ధపరుస్తాడో, అతడు కూడా యోధుడిగానే పరిగణించబడతాడు మరియు (తీర్పు దినమునాడు) అతడు ఒక యోధునికి లభించే పుణ్యఫలాన్ని పొందుతాడు.
అలాగే ఎవరైతే యోధుని పరోక్షంలో అతని వ్యవహారాలను చక్కగా చూసుకుంటాడో మరియు అతను లేనప్పుడు అతని కుటుంబాన్ని చూసుకోవడంలో అతని స్థానంలో అతని ప్రతినిధిగా ఉంటాడో అతడు కూడా యోధునిగా పరిగణించబడతాడు.