عَنْ أَبِي عَبْسٍ عَبْدُ الرَّحْمَنِ بْنِ جَبْرٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا اغْبَرَّتْ قَدَمَا عَبْدٍ فِي سَبِيلِ اللَّهِ فَتَمَسَّهُ النَّارُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2811]
المزيــد ...
అబూ అబ్స్ అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ జబ్ర్ (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్లాహ్ మార్గములో (శ్రమించుటలో) ఎవరి పాదములు దుమ్ము, ధూళితో కప్పబడబడతాయో, వాటిని నరకాగ్ని తాకదు.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 2811]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను వినిపిస్తున్నారు – అల్లాహ్ మార్గములో శ్రమిస్తున్న కారణంగా ఎవరి పాదములైతే దుమ్ము, ధూళితో ఆవరించబడతాయో, అటువంటి వ్యక్తిని నరకాగ్ని తాకదు అని.