عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا مِنْ قَوْمٍ يَقُومُونَ مِنْ مَجْلِسٍ لَا يَذْكُرُونَ اللَّهَ فِيهِ إِلَّا قَامُوا عَنْ مِثْلِ جِيفَةِ حِمَارٍ، وَكَانَ لَهُمْ حَسْرَةً».
[صحيح] - [رواه أبو داود] - [سنن أبي داود: 4855]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఏ సమావేశములోనైతే అల్లాహ్ నామస్మరణ జరుగదో, అటువంటి సమావేశము నుండి లేచిన ప్రజలు, వాస్తవానికి ఒక గాడిద శవము వద్ద నుండి లేచిన వారితో సమానము. అది వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది.”
[దృఢమైనది] - [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు] - [سنن أبي داود - 4855]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: “ప్రజలు ఏదైనా ఒక సమావేశములో పాల్గొని ఉండి, అందులో అల్లాహ్ యొక్క ప్రస్తావన లేకుండానే వెళ్ళిపోయినట్లయితే, అది దుర్గంధం మరియు ధూళితో కలిసి ఉన్న ఒక గాడిద మృతదేహం చుట్టూ కూర్చుని లేచి వెళ్ళిన దానితో సమానం. ఎందుకంటే, వారు అల్లాహ్ పేరును ప్రస్తావించకుండా మిగతా విషయాలు మాట్లాడడంలో మునిగిపోయారు. తీర్పుదినము నాడు అటువంటి సమావేశము వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది, మరియు నిరంతర విచారానికి కారణం అవుతుంది.