عن أبي هريرة رضي الله عنه
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فِيمَا يَحْكِي عَنْ رَبِّهِ عَزَّ وَجَلَّ، قَالَ: «أَذْنَبَ عَبْدٌ ذَنْبًا، فَقَالَ: اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي، فَقَالَ تَبَارَكَ وَتَعَالَى: أَذْنَبَ عَبْدِي ذَنْبًا، فَعَلِمَ أَنَّ لَهُ رَبًّا يَغْفِرُ الذَّنْبَ، وَيَأْخُذُ بِالذَّنْبِ، ثُمَّ عَادَ فَأَذْنَبَ، فَقَالَ: أَيْ رَبِّ اغْفِرْ لِي ذَنْبِي، فَقَالَ تَبَارَكَ وَتَعَالَى: عَبْدِي أَذْنَبَ ذَنْبًا، فَعَلِمَ أَنَّ لَهُ رَبًّا يَغْفِرُ الذَّنْبَ، وَيَأْخُذُ بِالذَّنْبِ، ثُمَّ عَادَ فَأَذْنَبَ، فَقَالَ: أَيْ رَبِّ اغْفِرْ لِي ذَنْبِي، فَقَالَ تَبَارَكَ وَتَعَالَى: أَذْنَبَ عَبْدِي ذَنْبًا، فَعَلِمَ أَنَّ لَهُ رَبًّا يَغْفِرُ الذَّنْبَ، وَيَأْخُذُ بِالذَّنْبِ، اعْمَلْ مَا شِئْتَ فَقَدْ غَفَرْتُ لَكَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2758]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“సర్వ శక్తిమంతుడు, మహోన్నతుడు అయిన తన ప్రభువు ఇలా ప్రవచించినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు: “నా దాసుడు ఒకడు పాపపు పని చేసినాడు. తరువాత ఇలా వేడుకున్నాడు “ఓ అల్లాహ్, నా ఈ పాపాన్ని క్షమించు.” అపుడు పరమ పవితృడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. తరువాత అతడు మళ్ళీ పాపపు పని చేసాడు. అతడు మళ్ళీ ఇలా వేడుకున్నాడు “ఓ నా ప్రభూ! నా ఈ పాపాన్ని క్షమించు”. అపుడు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని, మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. నేను నా దాసుణ్ణి క్షమించాను. అతడు ఏమి చేయ దలుచుకుంటే అది చేయనివ్వండి”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2758]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి ఇలా ఉల్లేఖించినారు – ఒకవేళ అల్లాహ్ యొక్క దాసుడు ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, ఆ తరువాత అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, దానికి అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాల్ను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను అతడిని క్షమించాను. తరువాత, అల్లాహ్ యొక్క దాసుడు తిరిగి ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, తరువాత తిరిగి అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాల్ను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను నా దాసుణ్ణి క్షమించాను. తరువాత, అల్లాహ్ యొక్క దాసుడు తిరిగి ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, తరువాత తిరిగి అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాలను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను నా దాసుణ్ణి క్షమించాను. కనుక, అతడు పాపపు పనికి ఒడిగట్టిన ప్రతిసారీ దానిని విడిచిపెట్టి, దానికి పాల్బడినందుకు హృదయపూర్వకంగా పాశ్చాత్తాపపడి, తిరిగి ఆ పనికి ఒడిగట్టనని తీర్మానించు కున్నట్లయితే, అతడు ఏమి చేయ దలుచుకుంటే అది చేయనివ్వండి. కాని అతడి ఆత్మ అతడిని లోబరుచుకుంటుంది, దానితో తిరిగి అతడు పాపపు పనిలో పడిపోతాడు. అటువంటి పాపపు పనికి ఒడిగట్టిన ప్రతిసారీ అతడు హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడినంత కాలము నేను అతడిని క్షమిస్తాను. ఎందుకంటే, పశ్చాత్తాపము పూర్వము జరిగిన దానిని తుడిచివేస్తుంది.