عَنْ المِقْدَادِ بْنَ عَمْرٍو الكِنْدِيَّ رضي الله عنه:
أَنَّهُ قَالَ لِرَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَرَأَيْتَ إِنْ لَقِيتُ رَجُلًا مِنَ الكُفَّارِ فَاقْتَتَلْنَا، فَضَرَبَ إِحْدَى يَدَيَّ بِالسَّيْفِ فَقَطَعَهَا، ثُمَّ لاَذَ مِنِّي بِشَجَرَةٍ، فَقَالَ: أَسْلَمْتُ لِلَّهِ، أَأَقْتُلُهُ يَا رَسُولَ اللَّهِ بَعْدَ أَنْ قَالَهَا؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لاَ تَقْتُلْهُ» فَقَالَ: يَا رَسُولَ اللَّهِ إِنَّهُ قَطَعَ إِحْدَى يَدَيَّ، ثُمَّ قَالَ ذَلِكَ بَعْدَ مَا قَطَعَهَا؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لاَ تَقْتُلْهُ، فَإِنْ قَتَلْتَهُ فَإِنَّهُ بِمَنْزِلَتِكَ قَبْلَ أَنْ تَقْتُلَهُ، وَإِنَّكَ بِمَنْزِلَتِهِ قَبْلَ أَنْ يَقُولَ كَلِمَتَهُ الَّتِي قَالَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4019]
المزيــد ...
అల్ మిఖ్’దాద్ ఇబ్న్ ఆమిర్ అల్ కిందియ్య (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికినాడు: “ఒకవేళ ఎవరైనా ఒక అవిశ్వాసి (యుద్ధంలో తారసపడి) మేమిద్దరమూ తలపడినపుడు; అతడు తన కరవాలముతో నా చేతిపై దాడి చేసి, నా చేతిని ఖండించి వేసి, నా నుంచి పరుగెత్తుకుని వెళ్ళి ఒక చెట్టును రక్షణగా చేసుకుని “అల్లాహ్’కు నన్ను నేను సమర్పించుకున్నాను” అని షహాదా పఠించినట్లైతే, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు ఆ విధంగా (షహాదా) పలికిన తరువాత నేను అతడిని చంపవచ్చునా?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, అతడిని చంపరాదు” అన్నారు. దానికి మిఖ్’దాద్ ఇబ్న్ ఆమిర్ “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు నా ఒక చేతిని ఖండించినాడు. దాని తరువాత కూడా అతడిని వధించకూడదా?” అన్నాడు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడిని చంపరాదు; ఒకవేళ అతడిని చంపినట్లయితే (గమనించు) అతడిని చంపక ముందు నీవు ఏ స్థానంలో ఉన్నావో, (షహాదా పలికిన తరువాత) అతడు ఆ స్థానంలో ఉన్నాడు. మరియు షహదా పలుకక ముందు అతడు ఏ స్థానంలో ఉన్నాడో నీవు ఆ స్థానంలో ఉంటావు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4019]
అల్ మిఖ్’దాద్ ఇబ్న్ అల్ అస్వద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించినారు: యుద్ధంలో ఒకవేళ తనకు ఒక అవిశ్వాసి తారసపడి, తామరిద్దరూ ఖడ్గాలతో తలపడినపుడు, అతడు ఖడ్గంతో తన రెండు చేతులలో ఒకదానిపై దాడి చేసి దానిని ఖండించి వేసి, తరువాత తన నుండి పారిపోయి ఒక చెట్టును రక్షణగా చేసుకుని “అష్’హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్” అని షహాదా పలికినట్లయితే, నా చేతిని ఖండించిన వాడిని చంపడానికి అనుమతి ఉందా?
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “లేదు, అతడిని చంపరాదు.”
అపుడు అతడు ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు నా ఒక చేతిని ఖండించినాడు, అయినా అతడిని చంపరాదా?”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అవును, అతడిని చంపరాదు. ఎందుకంటే (అతడు ఇస్లాం స్వీకరించుట వలన) అతని రక్తం చిందించుట హరాం (నిషేధము). అతడు ఇస్లాం స్వీకరణ ప్రకటించిన తర్వాత నీవు అతనిని చంపినట్లయితే, అతడు ఇస్లాం ప్రకటించడం అతడి జీవితాన్ని నీ జీవితం లాగానే ఉల్లంఘించరానిదిగా చేసింది, అతడు నీతో సమాన స్థానం కలిగి ఉంటాడు. అతణ్ణి చంపినందుకు చట్ట ప్రకారం ప్రతీకారంగా నీకు మరణశిక్ష విధించబడుతుంది.”