+ -

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: بَلَغَ رَسُولَ اللهِ صلى الله عليه وسلم ‌عَنْ ‌أَصْحَابِهِ ‌شَيْءٌ، فَخَطَبَ فَقَالَ:
«عُرِضَتْ عَلَيَّ الْجَنَّةُ وَالنَّارُ فَلَمْ أَرَ كَالْيَوْمِ فِي الْخَيْرِ وَالشَّرِّ، وَلَوْ تَعْلَمُونَ مَا أَعْلَمُ لَضَحِكْتُمْ قَلِيلًا وَلَبَكَيْتُمْ كَثِيرًا» قَالَ: فَمَا أَتَى عَلَى أَصْحَابِ رَسُولِ اللهِ صلى الله عليه وسلم يَوْمٌ أَشَدُّ مِنْهُ، قَالَ: غَطَّوْا رُءُوسَهُمْ وَلَهُمْ خَنِينٌ، قَالَ: فَقَامَ عُمَرُ فَقَالَ: رَضِينَا بِاللهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ نَبِيًّا، قَالَ: فَقَامَ ذَاكَ الرَّجُلُ فَقَالَ: مَنْ أَبِي؟ قَالَ: «أَبُوكَ فُلَانٌ»، فَنَزَلَتْ: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لا تَسْأَلُوا عَنْ أَشْيَاءَ إِنْ تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ} [المائدة: 101].

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2359]
المزيــد ...

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు వారి సహబాలను గురించి ఏదో విషయం అందజేయబడినది, అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉపన్యాసం ఇచ్చినారు, అందులో వారు ఇలా పలికినారు:
“స్వర్గం మరియు నరకం నాకు ప్రస్తుత పరచబడ్డాయి; ఈ రోజు (నేను చూసిన) శుభాన్ని మరియు కీడును నేను ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసినది (ఏమిటో) ఒకవేళ మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వేవారు మరియు ఎక్కువగా ఏడ్చేవారు”. అతడు (ఉల్లేఖకుడు) ఇలా అన్నాడు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు దీనికంటే భారమైన దినము మరొకటి లేదు. వారు తమ తలలు కప్పుకున్నారు మరియు వారి నుండి ఏడుపు శబ్దం వినిపించింది. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి నిలబడి ఇలా అన్నారు: “అల్లాహ్ మా ప్రభువుగా, ఇస్లాం మా ‘దీన్’గా (ధర్మముగా - జీవన నియమావళిగా) మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ‘ప్రవక్త’గా మేము చాలా సంతృప్తి చెందాము”; ఆ సమయంలో ఒక వ్యక్తి లేచి నిలబడి ఇలా అన్నాడు: ‘నా తండ్రి ఎవరు?’ అప్పుడు ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఫలానా అతడు మీ తండ్రి”; అప్పుడు ఈ ఆయతు అవతరించింది: {“యా అయ్యుహల్లజీన ఆమనూ, లా తస్’అలూ అన్ అష్యాఅ ఇన్ తుబ్’ద లకుం తసూకుమ్....”} [విశ్వాసులారా! ఒకవేళ ఆ విషయాలు మీకు తెలుపబడితే మీకు ఇబ్బంది కలిగించే విషయాలను గురించి అడగకండి...] (సూరహ్ అల్’మాయిదహ్ 5:101)

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2359]

వివరణ

రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరుల గురించి ఏదో విన్నారు, అంటే వారు ఆయనను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కలత చెంది ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నాకు స్వర్గం మరియు నరకం చూపించబడ్డాయి. నేను ఈ రోజు స్వర్గంలో చూసిన దానికంటే ఎక్కువ మంచిని, శుభాన్ని ఎప్పుడూ చూడలేదు, మరియు ఈ రోజు నరకంలో చూసిన దానికంటే ఎక్కువ చెడును, కీడును ఎప్పుడూ చూడలేదు. నేను చూసినది మీరు చూసి ఉంటే, ఈరోజు, అంతకు ముందు రోజు నేను చూసిన దాని నుండి నాకు తెలిసినది మీరు తెలుసుకుని ఉంటే, నిశ్చయంగా మీరు చాలా భయపడి ఉండేవారు, నిశ్చయంగా మీ నవ్వు తక్కువై పోయేది, మరియు మీ ఏడుపు పెరిగి ఉండేది. అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులకు ఇంత కష్టమైన రోజు మరొకటి లేదు. వారు తమ తలలను కప్పుకుని ఏడువ సాగారు, ఏడుపు తీవ్రత కారణంగా వారి ముక్కుల నుండి శబ్దాలు రాసాగినాయి. ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి నిలబడి ఇలా అన్నారు: మేము అల్లాహ్‌ను మా ప్రభువుగా, ఇస్లాంను మా ధర్మముగా, ముహమ్మద్‌ను సల్లల్లాహు అలైహి వసల్లం మా ప్రవక్తగా సంతృప్తి చెందాము. అనస్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: అపుడు ఒకతను నిలబడి ఇలా అన్నాడు: “నా తండ్రి ఎవరు?”
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఫలానా అతడు నీ తండ్రి”; అపుడు ఈ ఆయతు అవతరించినది. {ఓ విశ్వాసులారా! ఒకవేళ మీకు గనక వివరిస్తే మీకే ఇబ్బంది కలిగించే విషయాలను గురించి అడగకండి...}[అల్’మాయిదహ్ 5:101]

من فوائد الحديث

  1. అల్లాహ్ శిక్షకు భయపడి ఏడుపు రావడం, ఏడ్వడం మంచిదే; అలాగే అతిగా నవ్వడం మానుకోవడం మంచిది, ఎందుకంటే ఇది నిర్లక్ష్యం మరియు కఠిన హృదయాన్ని సూచిస్తుంది.
  2. సహబా (రదియల్లాహు అన్హుమ్), ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం మరియు దేవుని శిక్ష పట్ల వారికున్న తీవ్రమైన భయంతో ప్రభావితమయ్యారు.
  3. ఏడుపు వచ్చేట్లైతే, ముఖాన్ని కప్పుకోవడం చేయవచ్చును.
  4. ఇమాం అల్-ఖత్తాబి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథ్ తనకు అవసరం లేని విషయాలపై కపట ధర్మ పరాయాణత్వంతో లేదా మొండితనంతో అడిగే వారి గురించి. ఎవరైనా తనకు అవసరమైన విషయములో, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో అడిగితే, అంటే ఉదాహరణకు ఒక సమస్య ఎదురై దాని గురించి అడిగితే, అతనిపై ఎటువంటి పాపము లేదా నింద లేదు.
  5. ఈ హదీథు అల్లాహ్’కు విధేయత చూపడంలో, పాపాలను నివారించడంలో మరియు ఆయన పరిమితులకు కట్టుబడి ఉండటంలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
  6. అలాగే ఈ హదీథు ఏదైనా విషయాన్ని బోధించేటప్పుడు మరియు దేని గురించైనా హెచ్చరిక చేయునప్పుడు కోపాన్ని కూడా అనుమతిస్తుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా