عن عبد الله بن عباس رضي الله عنهما قال: كنت خلف النبي صلى الله عليه وسلم يوماً فقال يا غلام، إني أعلمك كلمات: «احْفَظِ اللهَ يحفظْك، احفظ الله تَجِدْه تُجَاهَك، إذا سألت فاسأل الله، وإذا اسْتَعَنْتَ فاسْتَعِن بالله، واعلمْ أن الأمةَ لو اجتمعت على أن ينفعوك بشيء لم ينفعوك إلا بشيء قد كتبه الله لك، وإن اجتمعوا على أن يَضرُّوك بشيء لم يَضرُّوك إلا بشيء قد كتبه الله عليك، رفعت الأقلام وجفت الصحف». وفي رواية: «احفظ الله تَجِدْه أمامك، تَعرَّفْ إلى الله في الرَّخَاء يَعرِفْكَ في الشِّدة، واعلم أنَّ ما أخطأَكَ لم يَكُنْ ليُصِيبَكَ، وما أصَابَكَ لم يَكُنْ لِيُخْطِئَكَ، واعلم أن النصرَ مع الصبرِ، وأن الفرجَ مع الكَرْبِ، وأن مع العُسْرِ يُسْرًا».
[صحيح] - [رواه الترمذي وأحمد بروايتيه]
المزيــد ...

అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు' నేను మహనీయదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లమ్ తో సవారి వెనుక కూర్చున్నాను అప్పుడు ఆయన ఓ కుమారా! నేను నీకు కొన్ని వాక్యాలు నేర్పిస్తాను జాగ్రత్తగా విను "అల్లాహ్ యొక్క శాసనాలను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడుతాడు,నీవు అల్లాహ్ హక్కులను పూరించు అల్లాహ్ ను నీ ఎదుట పొందుతావు,ఏదైనా అవసరం కలిగితే కేవలం అల్లాహ్ ను మాత్రం అర్దించు ,సహాయం కావాలంటే అల్లాహ్ ను మాత్రమే సహాయం కోసం అర్ధించు,ఒక విషయం గుర్తుంచుకో సమస్త లోకము ఒకటై నీకు ఒక విషయాన లాభము చేయదలిస్తే అల్లాహ్ నీకోసం వ్రాసి పెట్టియున్న లాభము మాత్రమే జరుగుతుంది,ఒకవేళ వారంతా కలిసికట్టుగా నీకు నష్టం చేయదలిస్తే కూడా అల్లాహ్ నీకు వ్రాసి పెట్టిన నష్టానికి మించి చేయలేరు,కలములు లేపబడ్డాయి,పత్రాలు ఎండిపోయాయి,మరో ఉల్లేఖనం ప్రకారం ‘నీవు అల్లాహ్ శాసనాలను రక్షించు,ఆయనను నీ ఎదుట పొందుతావు,శ్రేయస్సులో అల్లాహ్ ని తలుచుకో ఆయన నిన్ను కష్టాల్లో తలుస్తాడు,గుర్తుంచుకో నిశ్చయంగా సహనం తో పాటు సహాయం అందుతుంది లేమి తో పాటు కలిమి ఉంటుంది,కష్టం తో సుఖం ఉంటుంది.
దృఢమైనది - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు

వివరణ

ఈ గొప్ప హదీసు లో,దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ బాలుడు -ఇబ్నె అబ్బాస్-రజియల్లాహు అన్హు కు అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు,సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఆజ్ఞలను మరియు నిషేధాలను ప్రతీసమయంలో మరియు ప్రతి పరిస్థితిలో పాటించాలని ఆయనను ప్రోత్సహిస్తున్నారు అంతేకాక,అతని చిన్నతనంలోనే తన ధర్మాన్నిసరి చేయడానికి దైవప్రవక్త ప్రయత్నిస్తూ: అల్లాహ్ తప్ప సృష్టికర్త మరొకరు లేడని;ఆయన తప్ప మరో కార్యసాధకుడు లేడు మరియు సమస్త వ్యవహారాల నిర్వాహణలో ఆయనకు మరొకడు సాటి లేడు;దాసులకు మరియు అల్లాహ్ కు మధ్య ఎటువంటి మధ్యవర్తి లేడు;అబ్యర్ధనల్లో మరియు నమ్మకం లో ఆయనే ప్రభువు!కష్ట సమయాల్లో ఉపశమనం పొందాలన్న మరియు శిక్ష సమయంలో క్షమాపణ కోసం ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. అల్లాహ్ విధి మరియు విధితీర్పుల పట్ల విశ్వాసం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లామ్ వారు ఇబ్నుఅబ్బాస్ మదిలో నిక్షిప్తపరుస్తూ‘ప్రతి మంచి లేదా చెడు పరిశుద్దుడైన అల్లాహ్ విధివ్రాత మరియు తీర్పుల ప్రకారం జరుగుతుంది అని భోదించారు,మానవులకు కోరినట్లు తమకు కావలసిన ప్రకారంగా కొనసాగించే శక్తి వారిచేతుల్లో లేదు,సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అనుమతించినట్లు మాత్రమే కొనసాగుతుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. సవారి జంతువు బలిష్టిదైతే వెనుక కూర్చోపెట్టుకోవచ్చు.
  2. గురువు శిష్యుడికి భోదించడానికి ముందు భోదిస్తానని ప్రస్తావించవచ్చు,దాంతో ఆ విషయం పై అతనికి ఆసక్తి పెరుగుతుంది మరియు దాన్ని త్వరగా మనసు స్వీకరిస్తుంది.
  3. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన కన్న చిన్న వారిని ఎలా కనికరించేవారో తెలుస్తుంది,ఆయన చెప్పారు:
  4. {"يَا غُلام إني أُعَلِمُكَ كَلِماتٍ}ఓ అబ్బాయి!నేను నీకు కొన్ని వాక్యాలు నేర్పిస్తాను జాగ్రత్తగావిను.
  5. ఈ హదీసులో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు ప్రాధాన్యత తెలుస్తుంది,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఎప్పుడైతే అతన్ని చూశారో చిన్నబాలుడు అయినప్పటికినీ అతని అర్హతకు గాను ఈ వాక్యాలు ఉపదేశించారు.
  6. బహుమతి ‘కార్యానుగుణంగా సిద్దిస్తుంది
  7. అల్లాహ్ పై మాత్రమే నమ్మకం మరియు తవక్కులు కలిగియుండాలి అని ఆదేశించబడినది,ఆయనే ఎంతో గొప్ప కార్యసాధకుడు
  8. సమస్తజీవకోటి యొక్క బలహీనత తెలుస్తుంది.మహోన్నతుడు,శక్తిమంతుడు అయిన అల్లాహ్ వైపుకు మరలవలసిన అవసరం వారికి ఉంది.
  9. ప్రాపంచిక నివాసం కష్టాలతో ఇమిడి ఉంది అని హెచ్చరించబడుతుంది,దానిపై సహనసమన్వయాన్ని పాటించాలి.
  10. విధి,మరియు విధి తీర్పు పట్ల ప్రసన్నుడై ఉండాలి
  11. ఎవరైతే అల్లాహ్ ను (నిర్లక్ష్య వైఖరితో) వృధా చేస్తాడో అంటే- అల్లాహ్ ధర్మాన్ని వృధా చేస్తాడో-నిశ్చయంగా అల్లాహ్ అతన్ని వృధాచేస్తాడు,ఎన్నటికీ అతన్ని రక్షించడు.
  12. మహోన్నతుడు శక్తిమంతుడు అయిన అల్లాహ్ ను సంరక్షించినవాడికి సన్మార్గాన్ని ఒసగుతాడు మేలుతో నిండిన విషయాల వైపుకు మార్గాన్ని సులభ పరుస్తాడు.
  13. ఇందులో గొప్ప శుభ వార్త ఉంది,నిశ్చయంగా మనిషికి కష్టం కలిగినప్పుడు ఆ వెంటనే సుఖం కొరకు అతను వేచిచూడాలి.
  14. విపత్తు సంభవించినప్పుడు మరియు ప్రియమైనది కోల్పోయినప్పుడు ఈ రెండు ఆందోళనలో దాసుడు శాంతించాలి{ : "وَاعْلَم أن مَا أَصَابَكَ لَمْ يَكُن لِيُخطِئكَ، وَمَا أخطأَكَ لَمْ يَكُن لِيصيبَك" } గుర్తుంచుకో-నిశ్చయంగా నీకు లభించినది ఎన్నటికీ కోల్పోయేది కాదు’ మరియు నీకు దక్కనిది ఎన్నటికీ నీకు లభించేది కాదు’ మొదటి వాక్యం నచ్చనిది జరిగినప్పుడు శాంతినిస్తుంది,రెండవ వాక్యం నచ్చినది కోల్పోయినప్పుడు శాంతినిస్తుంది.
ఇంకా