عن أنس بن مالك رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: "إن عِظَمَ الجزاءِ مع عِظَمِ البلاءِ، وإن الله تعالى إذا أحب قوما ابتلاهم، فمن رَضِيَ فله الرِضا، ومن سَخِطَ فله السُّخْطُ".
[صحيح] - [رواه الترمذي وابن ماجه]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త ద్వారా ఉల్లేఖిస్తూ చెబుతున్నారు : నిశ్చయంగా దైవప్రవక్త తెలియజేశారు"నిశ్చయంగా ఎంత పెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం ఉంటుంది,నిస్సందేహంగా అల్లాహ్ తఆలా ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురిచేస్తాడు,ఎవరైతే దీంట్లో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతనిపట్ల సంతోష పడుతాడు మరెవరైతే విముఖత చూపుతాడో అల్లాహ్ కూడా అతనిపట్ల క్రోధాన్ని చూపుతాడు
[దృఢమైనది] - [దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ హదీసు ద్వారా తెలియజేసారు - ముస్లిముకు తన ధన ప్రాణాల విషయంలో ఆపదలకు పరీక్షలకు గురి అవ్వాల్సి వస్తుంది,ఈ అపదల్లో సహనం ఓర్పువహించిన వాడికి అల్లాహ్ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు,ఆపద తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువగా అల్లాహ్ తరుపున పుణ్యం ప్రాప్తిస్తుంది,ఆపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలిపారు – మోమిన్ కు వచ్చే ఆపదలు అల్లాహ్ కు అతని పట్ల గల ప్రేమ కు సంకేతాలు,అల్లాహ్ వ్రాసిన విధి వ్రాతలో ఏ విషయాలైతే నిక్షిప్త మయ్యాయో అవి జరిగి తీరుతాయి,అలాంటి సందర్భంలో ఎవరైతే ప్రసన్నుడిగా వాటిపై ఓర్పు వహిస్తారో నిశ్చయంగా అల్లాహ్ దానిపై ప్రసన్నత పొంది పుణ్యాన్ని నొసగుతాడు మరెవరైతే విధివ్రాత పట్ల అసహ్యంగా,ఆక్రోశానికి గురవుతాడో,అతనిపట్ల అల్లాహ్ క్రోధానికి గురి అయి తగిన విధంగా అతన్ని శిక్షిస్తాడు.