عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا يَزَالُ البَلاَءُ بِالمُؤْمِنِ وَالمُؤْمِنَةِ فِي نَفْسِهِ وَوَلَدِهِ وَمَالِهِ حَتَّى يَلْقَى اللَّهَ وَمَا عَلَيْهِ خَطِيئَةٌ».
[حسن] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2399]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”
[ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 2399]
ఈ హదీసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపరుస్తున్నారు : కష్టాలు వచ్చి మీద పడడం, వాటి ద్వారా అల్లాహ్ విశ్వాసులైన స్త్రీలను, పురుషులను పరీక్షించడం – ఈ రెండూ ఒకదాని నుండి మరొకటి విడదీయలేని విషయాలు. వాటి ద్వారా అల్లాహ్ స్వయంగా వారిని పరీక్షిస్తాడు – ఉదాహరణకు: స్త్రీలను, పురుషులను వారి ఆరోగ్యం విషయంలో, వారి శరీరం విషయంలో రుగ్మతలకు గురి చేసి; అలాగే సంతానం విషయంలో పరీక్షిస్తాడు, ఉదాహరణకు: సంతానాన్ని వ్యాధిగ్రస్తులను చేసి, వారిని మరణింపజేసి, లేదా వారిని తల్లిదండ్రుల పట్ల అవిధేయులుగా చేసి, లేదా ఇంకా వేరే విధానాలలో; అలాగే వారి సంపదల విషయంలోనూ పరీక్షిస్తాడు, ఉదాహరణకు: పేదరికానికి గురి చేసి, లేదా వ్యాపారంలో నష్టాలకు గురి చేసి, లేదా పేద జీవన పరిస్థితులలో మరియు జీవనోపాధిలో ఇబ్బందులకు గురి చేసి పరీక్షిస్తాడు; ఇలా అల్లాహ్ ఆ పరీక్షల ద్వారా వారి పాపాలు మరియు అతిక్రమణలు అన్నింటినీ పరిహరించే వరకు చేస్తాడు; ఆ విధంగా అతను అల్లాహ్‌ను కలిసినప్పుడు, అతను చేసిన పాపాలన్నింటి నుండీ మరియు అతిక్రమణలన్నింటి నుండీ శుద్ధి చేయబడిన స్థితిలో వారు అల్లాహ్ ను కలుసుకుంటారు.