عَن سَهْلِ بْنِ حُنَيْفٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ سَأَلَ اللهَ الشَّهَادَةَ بِصِدْقٍ بَلَّغَهُ اللهُ مَنَازِلَ الشُّهَدَاءِ، وَإِنْ مَاتَ عَلَى فِرَاشِهِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1909]
المزيــد ...

సహ్ల్ ఇబ్న్ హునైఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 1909]

వ్యాఖ్యానము

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే అల్లాహ్ మార్గంలో అమరత్వాన్ని మరియు ఆయన మార్గంలో షహీదు కావడాన్ని కోరుకుంటాడో, మరియు అతడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు తన సంకల్పములో నిజాయితీగా మరియు విశ్వాసపాత్రంగా ఉంటే, అల్లాహ్ అతని సంకల్పశుద్ధి, నిజాయితీ కారణంగా అతనికి అమరవీరుల హోదాను ప్రసాదిస్తాడు - అతడు ధర్మయుధ్ధములో (జిహాదులో) కాకుండా తన ఇంటిలోని మంచముపై మరణించినా సరే.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. చిత్తశుద్ధితో కూడిన సంకల్పం కలిగి ఉండడంతో పాటు, సాధ్యమైనది చేయడం అనేది సంకల్పించిన ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని పొందడానికి ఒక కారణం అవుతుంది; సంకల్పించిన ఆచరణ చేయలేకపోయినా సరే.
  2. ఇందులో జిహాదులో పాల్గొనే సంకల్పము కలిగి ఉండడం, మరియు అల్లాహ్ మార్గములో వీరమరణం పొందే కోరిక కలిగి ఉండడం పట్ల ప్రోత్సాహము ఉన్నది.
  3. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఉమ్మత్’కు ప్రసాదించే గౌరవం. ఆచరణ చిన్నదైనా కూడా ఆయన స్వర్గంలో అతడికి అత్యున్నత స్థానాలను ప్రసాదిస్తాడు.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (51)
ఇంకా