عن أبي بكرة نفيع بن الحارث الثقفي رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: «إذا التَقَى المسلمانِ بسَيْفَيْهِمَا فالقاتلُ والمقْتُولُ في النَّارِ». قلت: يا رسول الله، هذا القاتلُ فما بالُ المقتولِ؟ قال: «إنه كان حريصًا على قَتْلِ صَاحِبِهِ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ బకరత నఫీ బిన్ అల్ హారిస్ అస్సఖఫీ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘ఇద్దరు ముస్లింవిశ్వాసులు పరస్పరం కత్తులతో తలబడినట్లైతే వదించినవాడు మరియు మరణించినవాడు ఇద్దరూ నరకాగ్నికి ఆహుతి అవుతారు’ నేను ‘ఓ దైవప్రవక్త వదించినవాడు సరే మరణించినవాడు ఎందుకు?అని ప్రశ్నించాను,ప్రవక్త బదులిస్తూ; నిశ్చయంగా అతను కూడా ఆ వ్యక్తిని చంపడానికి ఉవ్విళ్లూరాడు’అని చెప్పారు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఇద్దరు ముస్లిములు రెండుకత్తులతో తలపడుతూ ఇద్దరూ ఎదుటి వ్యక్తిని అంతమొందించాలని భావిస్తుంటారు,అప్పుడు హతమార్చినవాడు తన ప్రత్యర్ధిని చంపిన కారణంగా నరకానికి ప్రవేశిస్తాడు,మరణించినవాడు కూడా అతన్ని చంపాలని కుతూహలపడ్డాడు కాబట్టి నరకానికి వెళ్తాడు,అయితే అల్లాహ్ ఇద్దరినీ క్షమించకపోతే మరియు ఆ పోరాటం న్యాయమైనది కానప్పుడు –అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు{(فإن بغت إحداهما على الأخرى فقاتلوا التي تبغي حتى تفيء إلى أمر الله }ఒకవేళ ఆ రెండు సముదాయాల్లోఒకరు మరొకరిపై దౌర్జన్యం చేస్తే,మీరంతా అలా దౌర్జన్యపరులకి వ్యతిరేఖంగా ‘అల్లాహ్ వైపుకు వారు మరలెంతవరకు పోరాడండి”.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఎవరైతే పాపాన్ని చేయు మనసుతో సంకల్పించుకుని దానిపై తనను స్థిరపరుచుకుని,కావలిసిన వనరులను కల్పించుకుని చేసినట్లైతే లేక చేయకపోయినను శిక్ష అతనికి కలుగుతుంది, ఒకవేళ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతన్ని క్షమించకపోతే,ఇక కేవలం మనసులో మాత్రమే సంకల్పించుకుని దాని వనరులను ఎంచుకోకపోతే అతనిపై ఎలాంటి పాపం ఉండదు
  2. ముస్లిములు పరస్పరం యుద్దం చేసుకోకూడదు అని హెచ్చరించబడుతుంది.
ఇంకా