ఉప కూర్పులు

హదీసుల జాబితా

“పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?*” అలా మూడు సార్లు పలికారు. దానికి మేము “తప్పనిసరిగా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని అన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట మరియు వారితో అమర్యాదగా ప్రవర్తించుట” అలా పలికి, అప్పటివరకు చేరగిలబడి కూర్చుని ఉన్న ఆయన నిటారుగా కూర్చుని “అబద్ధమాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” అని అన్నారు. ఈ మాటలను ఆయన ఆగకుండా పలుమార్లు పలుకుతూనే ఉన్నారు. ఎంతగా అంటే “వారు (ఇకనైనా) మౌనంగా ఉంటే బాగుండును” అని మేము భావించ సాగినాము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
“వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి*.” దానికి వారు (ఆయన సహచరులు) ఇలా అడిగారు “అవి ఏమిటి ఓ ప్రవక్తా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; చట్టబధ్ధమైన కారణం ఉంటే తప్ప “ప్రాణము తీయరాదు” అని అల్లాహ్ నిషేధించిన ప్రాణము తీయుట; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఇద్దరు ముస్లిములు, కత్తులు దూసి ఒకరిపై నొకరు దాడికి దిగితే, వారిలో చంపిన వాడూ మరియు చనిపోయిన వాడూ ఇద్దరూ నరకాగ్నిలో వేయబడతారు”*. అది విని నేను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! చంపిన వాడి కొరకు అది సరియైనదే, మరి చనిపోయినవాడి గురించి ఎలా?” అని ప్రశ్నించాను. దానికి వారు “అవకాశం దొరికితే తన తోటి వాడిని చంపాలనే అతడు ఆశించినాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక మంచి సహచరుని సాంగత్యము, మరియు ఒక చెడు సహచరుని సాంగత్యముల యొక్క ఉపమానం కస్తూరి సుగంధాన్ని అమ్మువానికి, మరియు లోహకారుని (కమ్మరివాని) కొలిమి తిత్తులను ఊదు వానిని పోలి ఉన్నది*. కస్తూరి సుగంధాన్ని అమ్మువాడు: అతడు నీకు కొద్ది సుగంధాన్ని ఉచితంగా ఇస్తాడు, లేదా నీవు అతడి నుండి కొద్ది సుగంధాన్ని కొనుక్కుంటావు, లేదా (అతని సాంగత్యములో గడిపిన కారణంగా) నీవు సుగంధాన్ని ఆస్వాదిస్తావు. లోహకారుని కొలిమి తిత్తులను ఊదువాడు: (కొలిమి నుండి నిప్పు రవ్వలు ఎగరడం వల్ల) అతడు నీ వస్త్రాలను కాలుస్తాడు, లేదా నీవు అతడి నుండి అప్రియమైన వాసన చూస్తావు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప*. బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడుటలో ఇది కూడా ఒక రకం – అందులో ఒకడు రాత్రివేళ పాపకార్యానికి ఒడిగడతాడు; ఉదయానికి అల్లాహ్ అతని పాపకార్యాన్ని (లోకులనుండి) కప్పివేస్తాడు; కానీ అతడు: “ఓ ఫలానా! ఓ ఫలానా! (నీకు తెలుసా) నేను రాత్రి ఇలా ఇలా చేసాను” అంటాడు (అలా అని దానిని బహిరంగ పరుస్తాడు). రాత్రి అతడు అల్లాహ్ యొక్క పరదా మాటున గడిపినప్పటికీ, ఉదయం అతడు తనంతట తానే ఆ పరదాను తొలగిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
. . :
عربي ఇంగ్లీషు ఉర్దూ
"ఎవరైనా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అతడు నిరంతరం అలా దూకుతూనే ఉంటాడు;* ఎవరైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా ఆ విషం అతని చేతిలోనే ఉంటుంది మరియు అదే విషాన్ని అతడు నిరంతరం తాగుతూనే ఉంటాడు; ఎవరైనా కత్తితో లేదా ఇనుప వస్తువుతో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అది అతని చేతిలోనే ఉంటుంది మరియు అదే వస్తువుతో అతడు నిరంతరం తన పొట్టను గాయపరుస్తూనే ఉంటాడు."
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
"చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి.* చిన్న చిన్న పాపాల ఉదాహరణ — కొంతమంది ఒక లోయలో దిగారు. వారిలో ఒకతను ఒక చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇంకొకతను మరో చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇలా అందరూ కలిపి కట్టేలను పోగుచేసి తమ రొట్టెలను కాల్చుకున్నారు (అంటే, పెద్ద మంటను వెలిగించారు). అలాగే, చిన్న చిన్న పాపాలు కూడా ఒకచోట పోగవుతుంటే, అవి అతన్ని నాశనం చేస్తాయి."
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్