عَنْ أَبِي مُوسَى رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّمَا مَثَلُ الْجَلِيسِ الصَّالِحِ وَالْجَلِيسِ السَّوْءِ كَحَامِلِ الْمِسْكِ وَنَافِخِ الْكِيرِ، فَحَامِلُ الْمِسْكِ: إِمَّا أَنْ يُحْذِيَكَ، وَإِمَّا أَنْ تَبْتَاعَ مِنْهُ، وَإِمَّا أَنْ تَجِدَ مِنْهُ رِيحًا طَيِّبَةً، وَنَافِخُ الْكِيرِ: إِمَّا أَنْ يُحْرِقَ ثِيَابَكَ، وَإِمَّا أَنْ تَجِدَ رِيحًا خَبِيثَةً».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2628]
المزيــد ...
అబూ మూసా అల్ అషఅరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఒక మంచి సహచరుని సాంగత్యము, మరియు ఒక చెడు సహచరుని సాంగత్యముల యొక్క ఉపమానం కస్తూరి సుగంధాన్ని అమ్మువానికి, మరియు లోహకారుని (కమ్మరివాని) కొలిమి తిత్తులను ఊదు వానిని పోలి ఉన్నది. కస్తూరి సుగంధాన్ని అమ్మువాడు: అతడు నీకు కొద్ది సుగంధాన్ని ఉచితంగా ఇస్తాడు, లేదా నీవు అతడి నుండి కొద్ది సుగంధాన్ని కొనుక్కుంటావు, లేదా (అతని సాంగత్యములో గడిపిన కారణంగా) నీవు సుగంధాన్ని ఆస్వాదిస్తావు. లోహకారుని కొలిమి తిత్తులను ఊదువాడు: (కొలిమి నుండి నిప్పు రవ్వలు ఎగరడం వల్ల) అతడు నీ వస్త్రాలను కాలుస్తాడు, లేదా నీవు అతడి నుండి అప్రియమైన వాసన చూస్తావు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2628]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రకాల ప్రజలను గురించి ఉపమానము ఇస్తున్నారు.
మొదటి రకం: మంచి సహచరుడు లేక ఒక మంచి మిత్రుడు. అతడు అల్లాహ్ వైపునకు మరియు అల్లాహ్ ఇష్టపడే వాటి వైపునకు మార్గదర్శకం చేస్తాడు మరియు అల్లాహ్’కు విధేయుడై ఉండుటలో సహాయపడతాడు. అతని ఉపమానము కస్తూరి సుగంధాన్ని అమ్మువానిని పోలినది. అతడు నీకు కొద్ది సుగంధాన్ని ఉచితంగా ఇస్తాడు; లేదా వీలైతే అతని వద్దనుండి నీవు కొంత సుగంధ ద్రవ్యాన్ని కొనుక్కుంటావు; లేదా నీవు ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తావు.
రెండవ రకం: చెడు సహచరుడు మరియు చెడు మిత్రుడు: ఇతడు అల్లాహ్ యొక్క మార్గమునుండి మళ్ళిస్తాడు; పాపకార్యములు చేయుటలో సహాయపడతాడు, నీవు అతని నుండి అసహ్యకరమైన ఆచరణలు చూస్తావు, అటువంటి వాడు నీ మిత్రుడు అయినందుకు మరియు నీ సహచరుడు అయినందుకు ప్రజలు నిన్ను నిందిస్తారు. అతడి ఉపమానము కొలిమిలో గాలితిత్తులు ఊదుతూ ఉండే కమ్మరివాని వంటిది. పైకి ఎగిరే నిప్పు రవ్వల కారణంగా అతడు నీ వస్త్రాలను కాలుస్తాడు, లేదా అతని సమీపములో (అతని సాంగత్యములో) ఉన్న కారణంగా అతడి నుండి అప్రియమైన వాసనను చూస్తావు.