عَنْ عَائِشَةَ أُمِّ المؤْمِنين رَضيَ اللهُ عنها قَالَتْ:
جَاءَتْنِي مِسْكِينَةٌ تَحْمِلُ ابْنَتَيْنِ لَهَا، فَأَطْعَمْتُهَا ثَلَاثَ تَمَرَاتٍ، فَأَعْطَتْ كُلَّ وَاحِدَةٍ مِنْهُمَا تَمْرَةً، وَرَفَعَتْ إِلَى فِيهَا تَمْرَةً لِتَأْكُلَهَا، فَاسْتَطْعَمَتْهَا ابْنَتَاهَا، فَشَقَّتِ التَّمْرَةَ الَّتِي كَانَتْ تُرِيدُ أَنْ تَأْكُلَهَا بَيْنَهُمَا، فَأَعْجَبَنِي شَأْنُهَا، فَذَكَرْتُ الَّذِي صَنَعَتْ لِرَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «إِنَّ اللهَ قَدْ أَوْجَبَ لَهَا بِهَا الْجَنَّةَ، أَوْ أَعْتَقَهَا بِهَا مِنَ النَّارِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2630]
المزيــد ...
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
“ఒక పేద స్త్రీ తన ఇద్దరు కూతుళ్ళను ఎత్తుకుని నా వద్దకు వచ్చింది. నేను ఆమెకు మూడు ఖర్జూరాలు ఇచ్చాను. ఆమె రెండు ఖర్జూరాలను తన కూతుళ్లకు చెరొకటి ఇచ్చింది. (మిగిలిన) ఖర్జూరాన్ని తను తినడానికి నోటి దగ్గరకు చెయ్యి ఎత్తింది. ఇంతలో ఆమె కూతుళ్ళు అది తమకు కావాలని అడిగారు. ఆమె ఆ ఒక్క ఖర్జూరాన్ని రెండు భాగాలు చేసి తన కూతుళ్ళకు చెరొక భాగాన్ని పంచి పెట్టింది. ఆమె చర్య నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటనను నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వివరించాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా దాని కారణంగా అల్లాహ్ ఆమె కొరకు స్వర్గాన్ని ‘వాజిబ్’ (తప్పనిసరి) చేసాడు” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దాని కారణంగా ఆమెకు నరకం నుండి విడుదలను ప్రసాదించినాడు.”
[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2630]
ఈ హదీథులో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సంఘటనను ఇలా ప్రస్తావిస్తున్నారు: ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఒక పేద మహిళ ఆమె వద్దకు వచ్చి మూడు ఖర్జూరాలు అడిగింది. ఆమె తన ఇద్దరు కూతుళ్ళకు ఒక్కొక్క ఖర్జూరాన్ని ఇచ్చింది మరియు మిగిలిన ఒక ఖర్జూరం తినేందుకు తన చేతిని తన నోటి దగ్గరికి ఎత్తింది. ఆమె తినాలనుకున్న ఆ ఖర్జూరాన్ని ఆమె ఇద్దరు కూతుళ్ళు తమకు కావాలి అని అడిగారు, అపుడు ఆమె ఆ ఖర్జూరాన్ని రెండు భాగాలు చేసి ఆ ఇద్దరికీ పంచి పెట్టింది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆమె పరిస్థితి చూసి ముగ్ధురాలైంది, మరియు ఆ మహిళ చేసిన పనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పింది, అది విని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ ఆ ఖర్జూరం కారణంగా ఆమెకు స్వర్గాన్ని వాజిబ్ చేసినాడు (తప్పనిసరి చేసినాడు); లేక ఆ ఖర్జూరము కారణంగా ఆమెను నరకాగ్ని నుండి రక్షించినాడు.”